finally singer madhu priya ties knot with srikanth | madhu priya talks about her marriage | madhu priya love affair controversy

Singer madhu priya speech after her marriage with lover srikanth

singer madhu priya marriage, singer madhu priya srikanth, madhu priya with srikanth, madhu priya marriage news, madhu priya marriage controversy, madhu priya love affairs, madhu priya srikanth love affair

singer madhu priya speech after her marriage with lover srikanth : after ties knot with srikanth singer madhu priya says everthing is cool now.

‘పెళ్లి అయిపోయిందిగా.. ఇక అంతా కూల్’

Posted: 10/30/2015 06:01 PM IST
Singer madhu priya speech after her marriage with lover srikanth

ఎట్టకేలకు వర్ధమాన సింగర్ మధుప్రియ పెళ్లి అయిపోయింది. నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం మధుప్రియ, శ్రీకాంత్ వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. మధుప్రియ ఏమాత్రం వినిపించుకోలేదు. చివరకి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని వారు ప్రాధేయపడినా.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను వదిలేసి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ముందు నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రకారమే.. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో ప్రియుడు శ్రీకాంత్ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. చివరికి వీరి పెళ్లి జరగడంతో అప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెర పడినట్లయింది.

ఇక పెళ్లైన అనంతరం మీడియాతో మాట్లాడిన మధుప్రియ.. ఎటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడకుండానే వివాహం హాయిగా జరిగిందని.. ఇప్పుడంతా కూల్ అంటూ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు కొన్ని సినిమా డైలాగులు కూడా చెప్పింది. ప్రతి ప్రేమ కథలో ఇబ్బందులు వుండడం సహజమేనని పేర్కొంది. ప్రేమ అంటేనే ఇబ్బందులు ఉంటాయని, అలాగే తన ప్రేమ కథలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ‘అయినా.. ఇబ్బందులొచ్చినంత మాత్రాన ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేము కదా?’ అని ప్రశ్నించింది. అయితే.. బయటకి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉన్నాయని ఆమె మదన పడింది. తర్వాత కోలుకొని.. ఇప్పుడంతా కూల్ అని, వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరించారని తెలిపింది. కాగా.. మధుప్రియ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వివాహానికి దూరంగా ఉండడం విశేషం. మరోవైపు.. వీరి వివాహానికి కొందరు మద్దతు తెలుపగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singer madhu priya marriage  madhu priya srikanth  

Other Articles