Adam Levine meets the girl left heartbroken over his marriage

Ellen degeneres surprises little girl with love adam levine

Adam Levine meets the girl left heartbroken over his marriage, Ellen DeGeneres , Adam Levine meets the girl left heartbroken over his marriage,news, India news,

Maroon 5 frontman Adam Levine gave his 3-year-old fan Mila the biggest surprise when he appeared on "The Ellen DeGeneres Show", where the little girl and her mom Emily made an appearance

ITEMVIDEOS: పాప్ సింగర్ కు పెళ్లైందని తెలసి.. గుండె పగిలేలా ఏడ్చిన చిన్నారి..!

Posted: 10/17/2015 08:12 PM IST
Ellen degeneres surprises little girl with love adam levine

అమెరికా ప్రముఖ పాప్ సింగర్ ఆడమ్ లెవైన్ సరిగ్గా రెండు వారాల క్రితం ఆ చిట్టి హృదయాన్ని ఎంతో గాయపర్చారు. తన బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తూ, తాను ఎంతగానో ప్రేమిస్తున్న ఆడమ్ లెవైన్ పెళ్లి చేసుకున్నాడనే వార్త విని ఆ చిట్టి హృదయం తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. ‘నో....నో....హి డిడ్‌నాట్...’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ చిట్టి హృదయం నిజంగా చిట్టి పాపదే. ముచ్చటగా మూడేళ్ల పాప మిలాదే! మరూన్-5 బ్యాండ్‌తో పాపులరయిన 36 ఏళ్ల ఆడమ్ లెవైన్‌ను మన మూడేళ్ల మిలా నిజంగా ఎప్పుడూ చూడలేదు. టీవీలో ఆయన పాటలు వినడం మిలాకు ఇష్టం. ముద్దు ముద్దుగా తన మమ్మీకి తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంది.

రెండు వారాల క్రితం ఓ రోజున తన తల్లి ఎమిలీతో కలసి కారులో షికారుకు వెళ్లింది. అలా వెళుతుండగా ఆడమ్ పెళ్లి చేసుకున్నట్టు రేడియోలో ఎమిలీ వార్త విన్నది. ఆ విషయాన్ని ఎమిలీ తన కూతురికి చెప్పింది. నిజమా....! అంటూ ముందుగా ఆశ్చర్యపోయిన మిలా అంతలోనే ఏడుపందుకుంది. ఆడమ్ పెళ్లి వార్త వింటే కూతురు ఎలా స్పందిస్తుందో చూద్దాం అనుకున్న ఎమిలీ కూతురు రియాక్షన్‌ను తన సెల్‌లో రికార్డు చేసింది. ఆ వీడియోను ఎమిలీ ‘యూట్యూబ్’లో పోస్ట్ చేయగా ఇప్పటికే యాభై లక్షల మంది వీక్షకులు చూశారు. అయ్యో! పాప అంటూ సానుభూతి కూడా కురిపించారు. ఈ వీడియో టీవీ ఛానళ్లతోపాటు పాప్ సింగర్ ఆడమ్ లెవైన్‌ను కూడా ఎంతో ఆకర్షించింది. ‘ఎలెన్‌ట్యూబ్’ అనే అమెరికా టీవీ ఛానెల్ ఓ రియాలిటీ షోలో భాగంగా శుక్రవారం నాడు ఆడమ్‌ను, ఆయనపై మనసు పారేసుకున్న మిలా, ఆమె తల్లి ఎమిలీని ఓ వేదికపైన కలిపింది.

రియాలిటీ షోలో భాగంగా హఠాత్తుగా వేదికపైకి గులాబీ పూవు పట్టుకొని వచ్చిన ఆడమ్ మ్యారేజ్ ప్రతిపాదన తరహాలో  ఆపాపకు గులాబీ పూవు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. అనంతరం ఆడమ్ చర్చలో పాల్గొంటూ ‘ఎంతో మంది అభిమానులు ఈ పాప వీడియో క్లిప్పింగ్‌ను నాకు పంపించారు. ముందుగా ఇద్దరు...ఒకరు నా భార్య, సారీ...సారీ...ఇయర్‌మఫ్స్ (ఓరకంట పాపను గమనిస్తూ), నా తల్లి పంపించింది. వెరీ క్యూట్ గర్ల్. క్యూట్ రియాక్షన్’ అని అన్నారు. ఆ మాటలక ఆ పాప తన తల్లి ఒడిలోకి సిగ్గుతో  ఒదిగి పోయింది. కార్యక్రమం అంతటా ఆ పాప ముభావంగానే కనిపించింది. తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారనే ఒక రకమైన బాధ ఆ పాపలో కనిపించింది. వయసొచ్చిన వారు, వయస్సు మీద పడిన వారు ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని ‘ప్లేటోనిక్ లవ్’ అంటాం. ఏమీ తెలియని ఈ పాప ‘లవ్’ను ఏమనాలో!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pop singer Adam Levine  marriage  mila  

Other Articles