Half Eaten Sashimi Comes Back To Life After Served Up In Restaurant

Terrifying moment sashimi fish jump from dinner plate

Japanese diners scream in shock as half-eaten fish JUMPS off the plate, Japanese Sashimi diner, Sashimi dish, 20 second Sashimi video, Sashimi video clip posted online, Eating, Sashimi, Comes Back To Life, Served Up, Restaurant, Japan

At least it's fresh! Diners scream in shock when their half-eaten sashimi comes back to life and JUMPS off the plate

ITEMVIDEOS: భళారే బలి.. వడ్డించిన చేపకు జీవం వచ్చింది..

Posted: 10/15/2015 09:55 PM IST
Terrifying moment sashimi fish jump from dinner plate

చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారా.. అయితే తస్మాత్ జాగ్రత్తా.. ఆ బిర్యానీ లోంచి కోడి కూతపెట్టకుండా చూసుకోండి.. ఏంటి మటన్ బిర్యానీయా.. అయితే. మేక అరవకుండా చూసుకోండి.. చేప బిర్యానీ తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త.. చేప ప్యాకెట్ లోంచి ఎగిరిపోకుండా చూసుకోండి. ఏంటీ బిర్యానీ తీసుకెళ్తే ఇలా జరుగుతుందా అని ఆరాలు తీస్తున్నారు కదూ.. ఇలా మాట్లాడుతున్నారేంటి మీకెమన్నా మెంటలా..? అని కూడా అనాలనుకుంటున్నారు కదూ..? కానీ మేం చెప్పేది ముమ్మాటికీ నిజం.. వినడానికే షాకింగ్గా ఉన్నా ఇది వాస్తవం.

ఓ రెస్టారెంటుకు వెళ్లిన ఆ జంటకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జపాన్లో సషిమి చేపలు బాగా పాపులర్. వీటిని పచ్చిగానే తింటారు. అయితే తమ కస్టమర్స్కి ఫ్రెష్ చేపలు పెడుతున్నామనే విషయాన్ని లైవ్లో ప్రూవ్ చేయాలనుకున్నారో ఏమో. ఓ రెస్టారెంట్లో ఫిష్ ఆర్డర్ చేసిన ఆ జంటకు బతికి ఉన్న చేపనే వడ్డించారు. నోరూరించే.. సషిమిని ఓముక్క కొరికి ప్లేట్లో పెట్టి మాట్లలో పడిపోయిన కస్టమర్స్... తాము తిన్న చేప బతికే ఉందని తెలుసుకుని షాకయారు..

ప్లేట్లో ఉన్న చేప.. ఉన్నట్టుండి కదలటం మొదలుపెట్టి  కాసేపయ్యాక.. ఏకంగా ప్లేట్లోంచి జంప్ చేసింది. దీంతో ఆర్డర్ ఇచ్చిన ఆసామితో పాటు... చుట్టుపక్కల వాళ్లు భయంతో కేకలు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ను ఓ వ్యక్తి  తన సెల్ఫోన్లో బంధించి ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఒక్క నిమిషం ఇరవై సెకండ్ల నిడివి వున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే రెండు వేల మందికి పైగా ఈ వీడియోపై కామెంట్స్ చేశారు. 20 సెకండ్ల ఈ వీడియోని ప్రపంచవ్యాప్తంగా.. 20లక్షల మంది వీక్షించారు. ఇంకా నమ్మకంగా లేకపోతే ఈ వీడియోను మీరు వీక్షించండీ..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eating  Sashimi  Comes Back To Life  Served Up  Restaurant  Japan  

Other Articles