Jagan wont come to the inauguration ceremony of Amaravati

Jagan wont come to the inauguration ceremony of amaravati

Chandrababu Naidu, jagan, Amaravati, AP capital, Capital city, Amaravati Inauguration, Inauguration ceremony, JaganMohanreddy

Jagan wont come to the inauguration ceremony of Amaravati. Chandrababu Naidu inviting every body for the inauguration ceremony of Amaravati on dasara. He is distributing invitation cards from last two days.

రానంటున్న జగన్.. చంద్రబాబుకు లేఖ

Posted: 10/15/2015 04:06 PM IST
Jagan wont come to the inauguration ceremony of amaravati

అన్ని ఏర్పాట్లు చేస్తుంటే వైయస్ జగన్ మాత్రం తనకు ఆహ్వానం అక్కర్లేదు. అసలు తాను రాను అంటున్నారు. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి శంఖుస్థాపనను దసరా రోజు అందరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లకు మంత్రులను, అధికారులను పురమాయించారు. గత రెండు రోజులుగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మోదీకి, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానపత్రికలు అందించారు. దేశవిదేశాల ప్రముఖుల అందరికి ఆహ్వానపత్రికలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఏపిలోని ప్రతిపక్ష నాయకుడు జగన్ కు కూడా ఆహ్వానం పంపడం మామూలే. కానీ తనకు ఆహ్వానం అందకముందే చంద్రబాబు నాయుడుకు ఇలా జగన్ లేఖ రాయడం విశేషం.

అమరావతి శంఖుస్థాపన ఈ నెల 22న అట్టహాసంగా జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో వెలుగులు చిందేలా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని. శంకుస్థాపన చేస్తున్నది ప్రజల రాజధానికి కాదు. పేద ప్రజల రాజధానికి అసలే కాదు...  మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశాలకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన అని జగన్ తన లేఖలో వివరించారు. కాబట్టే ప్రజలందరి తరఫునా ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ ముగించారు. మొత్తానికి జగన్ ఎనిమిది కారణాలను తన లేఖలో వివరిస్తు అమరావతి శంఖుస్థాసనకు తనను ఆహ్వానించవద్దని.. తాను రానని అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles