Pune Techie Deepthi More Killed Her Son And Jumped For Apartment To Death | Mother Killed Son | Pune Crime News

Pune techie deepthi more killed her son and jumped for apartment to death

mother killed her son, pune techie killed son, pune techie suicide, pune techie deepthi uicide, dipti suicide case, pune mother killed her son, deepthi suicide case

Pune Techie Deepthi More Killed Her Son And Jumped For Apartment To Death : A 34-YEAR-OLD software engineer allegedly killed her five-year-old son by slitting his wrist and then committed suicide by jumping off the fifth floor of the Sinhagad Road building where the family lived. The incident took place Sunday, which happened to be her birthday.

కొడుకును చంపి ఆపై టెక్కీ ఆత్మహత్య

Posted: 10/12/2015 06:10 PM IST
Pune techie deepthi more killed her son and jumped for apartment to death

ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పెళ్లయి ఓ కొడుకు కూడా వున్నాడు.. భర్తతో తన జీవితాన్ని అన్యోన్యంగానే కొనసాగించింది.. ఇద్దరిమధ్య అంతగా తగాధాలు కూడా లేవు.. అయితే ఏమైందో తెలీదు కానీ తన కొడుకును చంపేసింది.. క్షణికావేశంతో కొడుకను దయనీయంగా హతమార్చిన ఆమె కూడా మర్నాడు ఉదయం అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన పుణెలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇనస్ట్రుమెంటల్ ఇంజనీర్గా పనిచేస్తున్నదీప్తి మోరె(34) కొడుకు ఆర్నవ్(5), భర్త తేజాస్తో కలిసి పుణేలో విలాసవంతమైన ఏరియాలో నివస్తోంది. వీరి జీవితం అన్యోన్యంగానే కొనసాగింది. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదుగానీ.. భర్త వేరే గదిలో నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుఝామున దీప్తి తన కొడుకు ఆర్నవ్ గదిలోకి వెళ్లి అతడి చేతిమణికట్టు కోసి, తరువాత గొంతు నులిపి హత్య చేసింది. ఆదివారం ఉదయం ఏడుస్తూ భర్తతో ఈ విషయాన్నిచెప్పింది. అతడు ఆందోళనతో  పిల్లాడి చూసేందుకు గదిలోకి  వెళ్లాడు. ఇంతలో తన గదిలో గడియ పెట్టుకున్న దీప్తి  బాల్కనీలోంచి దూకేసింది. తేజాస్ ఇరుగు పొరుగువారి సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు  వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. వారికి అక్కడ దీప్తి మోరె రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. తనకు జీవితంలో చాలా ఆశలు ఉన్నాయని, అయితే ఏదీ తాను అనుకున్నట్టుగా జరగడం లేదనే ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది. అందుకే కొడుకుతోపాటు తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో మానసిక వేదనతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mother killed son  techie deepthi suicide case  pune crime news  

Other Articles