A Boyfriend Named Shaik Nabi Aslam Cheated A Girl In The Name Of Love And Disagree To Marry Her | Hyderabad Crime News

Boyfriend shaik nabi aslam cheated a girl in the name of love and disagree to marry her

love cheating cases, shaik nabi aslam cheated girlfriend, girlfriend cheated by boyfriend, hyderabad crime news, hyderabad love crimes, love affairs, illegal affairs, boyfriend fraud girlfriend

Boyfriend Shaik Nabi Aslam Cheated A Girl In The Name Of Love And Disagree To Marry Her : A Boyfriend Named Shaik Nabi Aslam Cheated A Girl In The Name Of Love And Disagree To Marry Her By Saying That She Has Already Affair With Another Guy.

ప్రేమన్నాడు.. అబార్షన్ చేయించాడు.. ముఖం చాటేశాడు..

Posted: 10/10/2015 11:27 AM IST
Boyfriend shaik nabi aslam cheated a girl in the name of love and disagree to marry her

‘ప్రేమ’ అనే రెండక్షరాల పేరును అడ్డం పెట్టుకుని కొందరు కీచకులు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. సినిమా డైలాగులు కొడుతూ పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అమ్మాయిలను లోబరుచుకుని, ఆ తరువాత తమ వాంఛను తీర్చుకుని ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఇప్పటికే ఎన్ని చోటుచేసుకున్నా అటు అమ్మాయిల్లోనూ మార్పు రావడం లేదు. ‘ప్రేమ’ అన్న పదానికి లొంగిపోయి పరాయివాళ్లకు తమ సర్వస్వాన్ని సమర్పించేస్తుంటారు. ఆ తర్వాత చేతులు కాలాక భోరుమని విలపిస్తుంటారు. ఇలాగే తాజాగా మరో అమ్మాయి ఓ కీచకుని చేతిలో మోసపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాకుత్‌పురా చావునీ నాదే అలీ బేగ్ ప్రాంతానికి చెందిన షేక్ షకీల్ కి షేక్ నబీ అస్లాం అలియాస్ అస్లాం (20) అనే కుమారుడు వున్నాడు. ఇంటర్‌తో చదువుకు స్వస్తిచెప్పి చెప్పిన అతగాడు.. పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు. ఇతగాడు బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన బాలిక (17)ను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. మొదట్లో అతని ప్రేమని ఆ అమ్మాయి అంగీకరంచకపోగా.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అతని వలలో పడిపోయిన ఆ అమ్మాయిపై కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే అతగాడు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. కొన్నాళ్ల ఈ విషయం గొప్యంగానే వున్నప్పటికీ.. ఓ సందర్భంలో బాలిక తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో వారు గతనెల 9న అస్లాం కుటుంబసభ్యులను కలిశారు. బాలికకు 18 ఏళ్లు నిండాక అస్లాంతో పెళ్లి చేద్దామని ఇరువురి కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అప్పుడు అస్లాం కూడా పెళ్లికి అంగీకరించాడు.

కానీ.. ఆ తర్వాత ఆ బాలికను పెళ్లి చేసుకునేందుకు నిరాకరంచాడు. అంతేకాకుండా బాలికకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేసి, ఆమెను అప్రతిష్టపాల్జేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఐపీసీ 415, 417,420, 376 సెక్షన్ల కింద అస్లాంపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love cheating cases  boyfriend fraud girlfriend  hyderabad crime news  

Other Articles