Indrani Mukherjea Given Statement Why She Gone In Unconscious | Sheena Bora Murder case | Mumbai Police

Indrani mukherjea statement on unhealthy reason sheena bora murder case

Indrani Mukherjea news, Indrani Mukherjea unhealthy, Indrani Mukherjea unconscious, sheena bora murder case, indrani mukherjea crime news, sheena bora controversy, sheena bora photos

Indrani Mukherjea Statement On Unhealthy Reason Sheena Bora Murder case : Indrani Mukherjea Given Statement Why She Gone In Unconscious.

ఇంద్రాణి ఎందుకు అస్వస్థతకు గురైందో తెలుసా?

Posted: 10/07/2015 10:23 AM IST
Indrani mukherjea statement on unhealthy reason sheena bora murder case

షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఘటన తెలిసిందే! ప్రస్తుతం బైకుల్లా జైల్లో వున్న ఆమె నాలుగు రోజుల క్రితం అనారోగ్య బారిన పడి, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన జేజే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అనంతరం ఆమె తిరిగి స్పృహలోకి రాగానే.. ఆమె పూర్తిగా కోలుకుందని ఆ ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. స్పృహలోకొచ్చిన తర్వాత పోలీసులు విచారించగా.. తాను ఎలాంటి ఔషదాలు తీసుకోలేదని తెలిపింది. అయితే.. ఈమె కావాలనే నాటకం ఆడుతోందని, బెయిల్ పై కేసు నుంచి బయటపడేందుకు అస్వస్థతకు గురైనట్లు ప్లాన్ చేసిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా వివరణ ఇచ్చుకుంది. తాను ఏ నాటకం ఆడలేదని, తాను అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి కారణం వేరే వుందని పేర్కొంది.

తన వద్ద ఏ మాత్రలు లేవని, ఎవరూ వాటిని ఇవ్వలేదని, అసలు తాను ఏ మాత్రలు వేసుకోలేదని షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఆమెతల్లి ఇంద్రాణి ముఖర్జియా పేర్కొంది. తన తల్లి మరణం గురించి తెలుసుకొని తీవ్ర విచారంలోకి కూరుకుపోయానని, దిగ్భ్రాంతికి లోనవ్వడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని చెప్పింది. ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న అనంతరం మంగళవారం రాత్రి డిశ్చార్జి అయిన సందర్భంగా ఆమె పై విధంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన అస్వస్థతకు తల్లి మరణమే కారణమని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంద్రాణిని బైకుల్లా మహిళా ఖైదీల జైలుకు తరలించారు. మరోవైపు... కోర్టు ఈమె కస్టడీని పొడిగించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indrani mukherjea unhealthy  sheena bora murder case  

Other Articles