MLA Roja Makes Controversial Comments On Chandrababu Assets | College Students Suicide Cases | Nara Lokesh Assets News

Mla roja controversial comments on chandrababu assets issue college students suicide cases

mla roja news, mla roja press conference, mla roja press meet, mla roja controversy, mla roja latest updates, mla roja photos, mla roja cleavage, roja cleavage show, roja latest news, mla roja comments on chandrababu, chandrababu assets news, nara lokesh assets news

MLA Roja Controversial Comments On Chandrababu Assets Issue College Students Suicide Cases : MLA Roja Makes Controversial Comments On Chandrababu Assets. She Also Questioned Ap Govt To Give Response And Report On College Students Suicide Cases.

‘బాబూ.. కోట్లు సంపాదించే ఆ కిటుకేంటో చెప్మా!’

Posted: 10/02/2015 01:00 PM IST
Mla roja controversial comments on chandrababu assets issue college students suicide cases

విపక్ష పార్టీలపై ముఖ్యంగా అధికార టీడీపీ మీద విమర్శలు గుప్పించడంలో తనకు తానే సాటి అని రోజా ఎన్నోసార్లు నిరూపించుకుంది. టీపీడీ నుంచి ఎవరైనా ఘాటు వ్యాఖ్యలు చేసినా, ఏదైనా ఘటన చోటు చేసుకున్నా చాలు.. అవకాశం దొరికిందని వెంటనే మైకు చేత పట్టుకుని మాటల యుద్ధానికి రంగంలోకి దిగుతుంది. అలాంటి అవకాశమే ఇప్పుడు మళ్లీ రావడంతో తాజాగా ఈమె మరోసారి టీడీపీ మీద నిప్పులు చెరిగింది.

ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబ ఆస్తులు ప్రకటించిన విషయం తెలిసిందే! ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. తాము పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని, జీవితం ఇలానే చాలా బాగుందన్నారు. ఆ మాటలపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేసింది. తిరుమలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి.. హెరిటేజ్  కు పాలు అమ్మిన  రైతులు ఎందుకు ఇంతవరకు కోటీశ్వరులు కావడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించింది. వారివంతా తప్పుడు లెక్కలని, కోట్లాది రూపాయల డబ్బుల్ని లోపల దాచి పెట్టుకుని, కేవలం కొద్ది మొత్తాన్నే ఆస్తుల రూపంలో చూపుతున్నారని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో కళాశాల విద్యార్థుల ఆత్మహత్య ఘటనల్ని తెరమీదకి తీసుకొచ్చింది.

నారాయణ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని రోజా తెలిపింది. ఇంతవరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సూటిగా ప్రశ్నించింది. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాలపై కేసు పెడతామని మంత్రి గంటా చెప్పారని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ఆయన్ను నిలదీసింది. ఒకవేళ నారాయణ కళాశాలల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఏమైనా ఇచ్చిందా అని అడిగింది. మరి.. ఈమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla roja press conference  chandrababu assets news  nara lokesh heritage  

Other Articles