athidi dead body found in dibbelapalem sunray beach after week days

Adithi dead body found at boghapuram sunray beach

adithi dead body found, adithi body at bogapuram beach, adithi body at dibbelapalem beach, adithi body at vijayanagaram sunray beach, adithi, visakhapatnam, srinivasa rao, missing, body, bogapuram, dibbelapalem, sun ray beach

adithi dead body found in boghapuram sunray beach, father and relatives of the victim identify her by ear rings and locket

భోగాపురం సన్ రే బీచ్కు చేరిన చిన్నారి అతిధి మృతదేహం! విషాదాంతం..!!

Posted: 10/01/2015 08:16 PM IST
Adithi dead body found at boghapuram sunray beach

మా చిన్నారికి ఎం కాదు.. బతికే వుంది.. అంటూ ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. పాపపై పంచప్రాణాలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులను విధి వక్రీకరించింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సన్ రే బీచ్కి గురువారం సాయంత్రం గుర్తుతెలియని చిన్నారి మృతదేహం కొట్టుకు వచ్చింది.  మృతదేహాన్ని గమనించిన స్థానికులు ...పోలీసులకు సమాచారం అందించగా.. ఆ మృతదేహం  ఏడు రోజుల క్రితం (గత గురువారం) విశాఖలో డ్రెయినేజీ లో పడి గల్లంతైన అదితి మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 
దీనిపై స్థానిక బోగాపురం పోలీసులు... విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులతో పాటు, అదితి తండ్రి కూడా ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా చిన్నారి మృతదేహంపై పింక్ కలర్ డ్రస్ ఉన్నట్లు... వయసు ఆరు నుంచి ఏడేళ్లు ఉండవచ్చని  సీఐ వైకుంఠరావు తెలిపారు.  మృతదేహం నీళ్లలో నాని ఉండటంతో ఆనవాళ్లు పట్టేందుకు వీలు లేకుండా ఉంది. అయితే టీవీలో కనిపించినట్లుగానే అదే రంగు దుస్తుల్లో చిన్నారి మృతదేహం వుందని స్థానికులు చెబుతున్నారు.

కాగా అతిధి మృతదేహం లభ్యమన బోగాపురం దిబ్బెలపాలెం ప్రాంతానికి పోలీసులతో పాటు వెళ్లిన అతిథి తండ్రి శ్రీనివాస రావు మృతదేహం తమ కూతురిదేనని గుర్తించారు. తన చిన్నారి చెవి దుద్దులు, మెడలోని తాయత్తు ఆధారంగా అమె తన కూతురేనని గుర్తించాడు. తన చిన్నారి కూతరు విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి అక్కడే కుప్పకూలాడు. తన చిన్నారి అతిధి కోసం అయన విలసిప్తున్న తీరు కఠిన హృదయులైన పోలీసుల చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. విశాఖలో తప్పిపోయిన కూతరు వారం రోజుల తరువాత నిర్ఝీవంగా మారడాన్ని అసుపత్రి ఆవరణ సహా విశాఖలో విషాధఛాయలు అలుముకున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adithi  visakhapatnam  srinivasa rao  missing  body  bogapuram  dibbelapalem  sun ray beach  

Other Articles