teacher thrashed by parents for harassing students physical and mentally

Police register case on teacher for molesting students

police register case on teacher, teacher thrashed by parents, police register case on teacher, teacher molesting students, teacher harassed students physical and mentally, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women, kuravi teacher, 10th class students, parents, molesting allegations, police case

police register case on teacher for molesting students, after thier parents thrashed him for harssing their children physical and mentally

కీచకోపాధ్యాయుడిపై పోలీసు కేసు.. పదో తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులు

Posted: 09/26/2015 05:25 PM IST
Police register case on teacher for molesting students

భారతీయ సభ్య సమాజంలో అమ్మాయిగా పుట్టడం పెద్ద తప్పా..? ప్రస్తుత కాలంలో తమకు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ ఆడపిల్ల తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న. ఆడపిల్లగా పట్టడం అంటే.. అంగట్లో బొమ్మేనా..? తండ్రి, సోదరుడు, గురువు, పక్కింటివాడు, పోరుగింటివాడు, అపరిచితుడు, పరిచితుడు, ఇలా ఎవడు పడితే వాడు.. తాను వయస్సుకు వస్తున్న తరుణంలో తమను కామవాంఛతో చూస్తారా..? ఒక్క అమ్మ.. (అమె అడది కనుక) తప్ప సభ్య సమాజంలో తమను అండగా, రక్షణగా నిలచే వారే లేరా..? యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతా: అన్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఏమయ్యాయి.? అవి నాటి తరం పురుషసమాజంతోనే సమాధి కట్టబడ్డాయా..? ఇవి ఏ అడపిల్లను కదిలించినా వినబడుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పేదెవరు..?

మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నట్లుగానే విద్యార్ధినులు తల్లిదండ్రుల తరువాత అత్యంత ప్రేమగా మెలిగేది గురువులతోనే. అలాంటి గురువు స్థానంలో కొనసాగుతూ బాలికలపై వికృత చేష్టలకు దిగాడు ఓ నీచుడు. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యతను మరచి లైంగికవేధింపులకు యత్నించాడు. తమకు జరుగుతున్న అవమానాన్ని తల్లిదండ్రులకు చెప్పి.. వారిని వెంటబెట్టుకుని వారండంతో పాఠశాల వద్ద ఆందోళన చెలరేరింది. పదో తరగతి పిల్లలతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియకుండానే ఉపాధ్యాయ వృత్తిలోకి కీచకులు, నీచులు రావడంతోనే ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం.. కురవి శివారులోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు వికాస్ పాఠాలు చెప్పే క్రమంలో పదోతరగతి బాలికల తొడలు గిల్లడం, తలపై చాక్‌పీస్‌తో కొట్టడం, హేళనగా మాట్లాడడం లాంటి చేష్టలకు దిగుతున్నాడు. ఈ మేరకు వారు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు పాఠశాలకు చేరి ఆందోళనకు దిగారు. ఫిజిక్స్‌కు బదులు బయోలాజికల్ సైన్స్ పాఠాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేట్రిన్ శోభారాణి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు.

ప్రిన్సిపాల్‌కు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈ విషయాన్ని విలేకరులకు వివరిస్తుండగా ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి ప్రధాన ద్వారం వద్దకు వచ్చి బాలికలు చెప్పే విషయాన్ని వినకుండా నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో బాలికలు, తల్లితండ్రులు ఆయనతో వాదనకు దిగారు. సమాచారం అందుకున్నపోలీసులు గురుకులానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వికాస్‌తోపాటు మేట్రిన్‌పై ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు తెలిపారు. ఈవిషయమై ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. బాలికల ఫిర్యా దు మేరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kuravi teacher  10th class students  parents  molesting allegations  police case  

Other Articles