Female boss of cartel 'responsible for more than 180 violent incidents in Baja California' is arrested in Mexico

Mexico s most notorious female cartel leader arrested

Revealed,rise,downfall,Mexico,s,powerful,female,Cartel,boss,La,China,s,hitman,boyfriend,horrified,maniacal,murdering,monster,d,shopped,cops,Melissa ‘La China’ Calderon, assassin boyfriend, second-in-command, Pedro ‘El Chino’ Gomez, 'maniacal', 'control-freak', 180 murders, Powerful female narco, Mexico, Notorious Female Cartel, La,China, 180 violent incidents, Baja California

A feared female cartel boss known for kidnapping her victims and dumping their dismembered bodies on their families' doorsteps has been shopped to police by her own hitman lover who became horrified by the monster she had become.

అందాల అపరంజి కాదు.. అడతనం, అమ్మతనం లేని కర్కోఠకి..

Posted: 09/24/2015 10:23 PM IST
Mexico s most notorious female cartel leader arrested

అమ్మాయి అందులో కాస్తా అందం కూడా వుంది. అందమైన అమ్మాయి.. మరోలా చెప్పాలంటే.. అపరంజి బొమ్మ. అయితే అందానికి తగ్గట్టుగా అమెకు పుర్రెలో బుద్దిని మాత్రం ప్రసాదించలేదు ఆ దేవుడు. అంతేకాదు కమ్మనైన అమ్మతనం కానీ, అడవారిలో వుండాల్సిన సహనం, శాంతి, ఓర్పు గుణాలు ఏకోశాన లేవు. అందుకనే అమెను అందాల అపరంజి కాదు.. అడతనం, అమ్మతనం లేని కర్కోఠకి  అంటున్నాం. ఎందుకంటారా.. ఒకటి రెండు కాదు ఏకంగా 180చ మందిని జలీ, ధయ, కరు, క్షమ అనేవి లేకుండా కాల్చి చంపి వారి పునాదులపైన తన అక్రమ చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించి..తిరుగులేని లేడి డాన్‌గా ఎదిగిన ‘లా చినా’ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

అమె చేస్తున్న బీతావాహ ఘటనలతో బెదిరిపోయిన అమె ప్రియుడు, బాయ్ ఫ్రెండ్‌గా, లవర్‌గా, ఆమె డ్రగ్ కార్టెల్‌కు సెకండ్ ఇన్ కమాండ్‌గా ఉంటూ వచ్చిన పెడ్రో ఎల్ చినో ఆమె రక్తదాహాన్ని చూసి తట్టుకోలేక మెక్సికన్ పోలీసులకు అమె గురించి పూసగుచ్చినట్లు అన్ని నేరాలను స్వయంగా చెప్పడంతో రంగంలోకి దిగిన వారు అమెను అరెస్టు చేశారు. తన మనుషులు అనుకున్న వారిని కూడా అమె కళ్ల ముందే పిట్టల్లా కాల్చి చంపుతుంటే బెదిరిపోయాన చినో.. మాఫియా కార్టెల్ నుంచి పారిపోయి పోలీసులకు చిక్కి పోయాడు. ఆమె మృతదేహాలను ఖననం చేసే రహస్య స్థలాల గురించి, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఆమెను ఎలా పట్టుకోవచ్చో పోలీసులకు వివరించాడు. పోలీసులు వ్యూహం పన్ని కాబో సాన్ లుకాస్ ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు లా చినాను అరెస్టు చేశారు.

30 ఏళ్ల లా చినా అసలు పేరు మెలిస్సా మార్గరిటా కాల్డరాన్ ఒజేడా. ఆమెను, ఆమె ముఠాను లా చినాగానే పిలుస్తారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే అతిపెద్ద ముఠా అయిన ‘డమాసో కార్టెల్’లో లా చినా 2005లో చేరింది. డ్రగ్ స్మగ్లింగ్‌కు పేరుపొందిన మెక్సికో దేశంలోని బాజా కాలిఫోర్నియా సుర్ ప్రాంతంలో ఆ కార్టెల్ కార్యకలాపాలు ఎక్కువగా సాగేవి. మగవాళ్ల ఆధిపత్యంగల డ్రగ్ మాఫియాలో లా చినా కిడ్నాప్‌లు, హత్యలు చేయడం ద్వారా అందమైన రాక్షసిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. అప్పటికి డమాసో కార్టెల్‌కు అధిపతిగావున్న ఎల్‌చాపో గుజమేన్ పోలీసుల కేసుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న లా చినా మాఫియాపై పట్టు సాధించింది. 2008లో మాఫియా కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించింది.

అదే ముఠాకు చెందిన అబెల్ క్వింటరో గత జూన్ నెలలో జైలు నుంచి విడుదలై లా చినాను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించాడు. దాంతో ముఠాలోని కొంతమంది సభ్యులను చేరదీసి ‘లా చినా’ పేరిట ఆమె కొత్త ముఠాను స్థాపించింది. ఒక్క నెల రోజుల్లోనే పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ‘కాబో సాన్ లుకాస్’ రిసార్ట్ ప్రాంతాన్ని, లా పజ్ నగరాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. దాదాపు 300 మంది లోకల్ డ్రగ్ డీలర్లను ఏర్పాటు చేసుకొంది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి వారందరికి ఎర్రరంగు మోటారు బైకులు, తుపాకులు ఇచ్చింది. లా చినా ఆధీనంలోని వీధుల్లో వారిదే ఇష్టారాజ్యంగా ఉండేది.

పై చేయి కోసం ఆమె ఎంతోమంది శత్రు ముఠాల సభ్యులను కిడ్నాప్‌లు చేయించి, వారిని చిత్రహింసలకు గురిచేసింది. చివరకు మృతదేహాలను వారి కుటుంబాల ఇళ్ల గడపల ముందు పడేయించేది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేందుకు రకరకాల పిస్టళ్లు, తుపాకులు పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చేది. డ్రగ్ మాఫియా కారణంగా 2014లో మొత్తం 46 హత్యలు జరగ్గా ఈ మూడు నెలల కాలంలోనే 50 హత్యలు జరిగాయని, వాటిలో ఎక్కువ హత్యలు లా చినానే చేసిందని పోలీసుల ఆరోపణ. గత ఏడేళ్లలో జరిగిన హత్యలకన్నా డ్రగ్ కార్టెల్ కమాండర్‌గా లా చిన్ బాధ్యతలు స్వీకరించాక హత్యలు ఆరింతలు పెరిగాయన్నది పోలీసుల అంచనా.

ఆమె ఎంత నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేస్తుందన్న దానికి ఆగస్టులో జరిగిన ఓ ఉదంతాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్, లవర్ ఎల్ చినో ఇలా తెలిపాడు. ‘లా చినా తన కోసం పోలీసుల వేట పెరిగిందని తెలిసి అవసరం అయినప్పుడు పారిపోవడానికి పికప్ ట్రక్కును కొనాల్సిందిగా తన వ్యూహకర్త ఎల్ టైసన్‌ను ఆదేశించింది. అతడు తన పేరెంట్స్ ఫ్రెండ్స్ వద్దనున్న వ్యాన్‌ను కొనేందుకు వారిని లా చినా వద్దకు తీసుకొచ్చాడు. బేరం కుదిరింది. కానీ ఒక్క నయాపైసా కూడా చెల్లించకుండా వ్యాన్‌ను అమ్మడానికి వచ్చిన ఇద్దరిని అక్కడికక్కడే కాల్చి చంపేసింది. ఇది దారుణమంటూ పోలీసుల వద్దకు వెళతానని టైసన్ బెదిరించాడు. వెంటనే లా చినా అతడి రెండు ముంజేతులను తెగ నరికింది. అనంతరం చిత్రహింసలకు గురిచేసి హత్య చేసింది’ చివరకు బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సమాచారం మేరకే లా చినా దొరికిపోయింది.      

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mexico  Notorious Female Cartel  La  China  180 violent incidents  Baja California  

Other Articles