A Miracle in Tirumala Srivari Temple

A miracle in tirumala srivari temple

Tirumala, Tirupati, Srivaaru, venkateshwara, Lord Venkateshwara, Parrot, brahmostavam

A Miracle in Tirumala Srivari Temple. A parrot appear in the temple at the Brahmostava time. Devotees are beleving that Venkaeshwara swamy blessed them.

తిరుమల శ్రీవారి ఆలయంలో అద్భుతం

Posted: 09/21/2015 09:35 AM IST
A miracle in tirumala srivari temple

తిరుమల శ్రీవారి ఆలయంలో అద్భుతం సాక్షాత్కరించింది. శ్రీవారి శ్రీవల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చిన గోదాదేవి మాలలు, రామచిలుక బొమ్మలను అర్చకులు ఆలయంలో ఉంచారు. ఉదయం మోహినీ అవతారంలో ఉన్న స్వామివారికి మాలలు అలంకరించేందుకు లోనికి వెళ్లి చూడగా నిజమైన రామచిలుక ప్రత్యక్షమైంది. పైగా ఆ చిలుక మెడలో పూలమాల ఉండటాన్ని చూసి అర్చకులు ఆశ్చర్యపోయారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం తోమాల సేవకు ఆండాల్‌ అమ్మవారికి అలంకరించిన పూలమాలను తీసుకొచ్చి శ్రీవారికి అలంకరించడం ఆనవాయితీ. అయితే ఈసారి రామచిలుక పూలమాలతో కనిపించడంతో సాక్షాత్తూ గోదాదేవే వచ్చినట్లుగా అంతా భావిస్తున్నారు.


గతంలో కూడా ఇలాంటి  అద్భుతాలు జరిగాయి. లండన్కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్కు లండన్లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు. కాగా చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala  Tirupati  Srivaaru  venkateshwara  Lord Venkateshwara  Parrot  brahmostavam  

Other Articles