there is twenty thousand debt on Telangana citizens

Twenty thousand debt on telangana citizen

KCR, Debt, Telangana, Citizen of Telangana, Reddappa Reddy, Tax, Telangana Revenue

there is twenty thousand debt on Telangana citizens. By the Debt from the sources, KCR Made avg debt in double digit.

తెలంగాణ సగటు 20వేల అప్పు.. అంతా కేసీఆర్ పుణ్యం

Posted: 09/18/2015 03:13 PM IST
Twenty thousand debt on telangana citizen

తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ ఉన్న రెండో రాష్ట్రం.. రాష్ట్రానికి గుండె వంటి హైదరాబాద్, సిరిసంపదలు కలిగిన బొగ్గు నిల్వలు ఇలా తెలంగాణ గురించి పొగిడిన వాళ్లు ఇక మీదట తెలంగాణలోని అప్పులు లేని వ్యక్తుల జాబితా అంటూ ఒ జాబితాను విడుదల చెయ్యాలేమో. ఇంతకీ ఏంటి విషయం అంటే... తెలంగాణ రాష్ట్రానికి సంబందించి అప్పుల లెక్కల మీద తాజాగా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అందులో తెలంగాణ సగటు అప్పు, ప్రతి తెలంగాణ వ్యక్తి తల మీద ఉన్న అప్పు మీద చర్చ సాగుతోంది. తాజాగా వెల్లడించిన చేదు నిజాల్లో.. కేసీఆర్ గారి పుణ్యమా అని తెలంగాణ పౌరులకు అప్పు భారం పెరగింది. కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణ పౌరులకు భారంగా మారుతోంది.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి కవితా.. తెలంగాణలో పుడుతున్న ప్రతి బిడ్డపై, పుట్టుకతోనే 20 వేల అప్పు భారం పడుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాఖ్యానించింది. ఇండియాలో గుజరాత్ తరువాత ఆదాయం మిగులు రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకున్న కేసీఆర్  61 వేల కోట్ల అప్పు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఫోరం అభిప్రాయపడింది. ఈ రుణాలను అధిక వడ్డీలకు తీసుకోవడంతో బడ్జెట్ లో వడ్డీల భారం అధికం కానుందని, దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని ఫోరం అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి హెచ్చరించారు

ఇప్పటికైనా కేసీఆర్ సర్కారు కళ్లు తెరవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ అప్పులపై తాము సమాచార హక్కు చట్టం వినియోగించి సమాచారం పొందామని ఆయన తెలిపారు. పాలనాపరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం 9 శాతం వడ్డీతో బాండ్లను విక్రయించి 23 వేల కోట్లు, 11 శాతం వడ్డీకి 24 వేల కోట్లు రుణాల రూపంలో తెచ్చుకుందని, వీటి ప్రభావం ఇప్పటికే ప్రజలపై పడిందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 'పెట్రో' ఉత్పత్తులపై అధిక పన్నులు వేశారని ఆయన గుర్తించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకుంటే, వడ్డీల భారం మోయక తప్పదని అన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : KCR  Debt  Telangana  Citizen of Telangana  Reddappa Reddy  Tax  Telangana Revenue  

Other Articles