Malayalam actor Sidharth Bharathan injured in road accident, still critical

Mammootty dileep visit sidharth bharathan in hospital

Sidharth Bharathan, Sidharth Bharathan accident, Sidharth Bharathan news, Sidharth Bharathan hospital, Sidharth Bharathan latest news, Sidharth Bharathan car accident, entertainment news

Malayalam actor Sidharth Bharathan met with an accident on Saturday (September 12) at 2 am, and was critically injured in Chambakkara, Kochi.

కారు ప్రమాదంలో గాయపడిన యువనటుడి పరిస్థితి విషమం

Posted: 09/12/2015 06:44 PM IST
Mammootty dileep visit sidharth bharathan in hospital

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డిన మళయాళ చిత్ర పరిశ్రమలోని యువ నటుడు, దర్శకుడు సిద్ధార్థ భరతన్ పరిస్థితి ఇంకా విషమంగానే వుంది. శనివారం తెల్లవారుజామున ఆయన వెళ్తున్న కారు రోడ్డు పక్కనున్న ఓ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చంపక్కర వద్ద జరిగిన ప్రమాదంలో సిద్దార్థ తలకు తీవ్రగాయమైంది. ఆయనను కొచ్చిలోని మెడికల్ ట్రస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నా.. స్థిరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రముఖ మళయాళ దర్శకుడు భరతన్, నటి కేపీఏసీ లలితల కుమారుడే సిద్దార్థ. నటులు మమ్ముట్టి, దిలీప్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, హోం మంత్రి రమేష్ చెన్నితాల ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సిద్దార్థ దర్శకత్వంలో ఈ ఏడాది మొదట్లో దిలీప్ హీరోగా వచ్చిన 'చంద్రెట్టన్ ఎవిడెయ' అనే సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sidharth bharathan  accident  critical  entertainment news  

Other Articles