Maheshbabu is not real hero

Srihari is the real hero in social service

Srihari, mahesh Babu, Srimathudu, Prakash Raj, Sachin, Modi, Mahesh babu News

srihari is the real hero in social service. he adopt village and develop it and did several services to society.

రియల్ హీరో.. మహేష్ కాదు శ్రీహరి.. ఎందుకంటే

Posted: 09/11/2015 03:18 PM IST
Srihari is the real hero in social service

సచిన్, మహేష్ బాబు, ఫ్రకాశ్ రాజ్.. ఇలా ఇక ముందు మరెందరో ముందుకు వస్తున్నారు. ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని.. ఆ గ్రామ అభివృద్దిలో పాలుపంచుకుంటున్నారు. కానీ ఎవరో ఒకరు ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఏటో వైపు. అన్న పాటలాగా వీళ్లందరి కన్నా ముందు నడిచిన ఓ మహానుభావుడిని మాత్రం అందరూ మరుస్తున్నారు. తాజాగా వస్తున్న కథనాలు కూడా ఈ హీరోలు, ప్లేయర్లే గ్రేట్ చరిత్రలో ఎవ్వరూ చెయ్యలేదనంతలా డబ్బా కొడుతున్నాయి. కానీ అంతకు ముందే చరిత్రకు కొత్త ముఖాన్ని కొత్త భాష్యాన్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని మాత్రం చరిత్ర పుటల్లోంచి చెరిపివేసినట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు ప్రకాశ్ రాజ్ కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. కానీ ప్రస్తుతానికి దత్తత మాత్రమే తీసుకున్నార. అంతకన్నా ముందే తెలుగు సినిమా వాళ్లు లేవక ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శ్ గ్రామ్ యోజన కార్యక్రమాన్ని మొదలుపెట్టక ముందే ఓ వ్యక్తి మేలుకొని... ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాడు. ఆ వ్యక్తే... శ్రీహరి.

ఇతర ప్రాంతాలలోని వారికి కూడా సహాయసహకారాలు అందించారు.  నెల్లూరు జిల్లా కావలి అరుంధతీవాడలో బడి పిల్లలకు అక్షర ఫౌండేషన్‌ ద్వారా  పుస్తకములు, పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. సరిహద్దులో కాపుకాసే సైనికుల వల్లే మనం కంటినిండా నిద్రపోతున్నామని,  అలాంటి వీరులు యుద్ధంలో మరణిస్తే వారి పిల్లలు అనాధలవుతున్నారని, అటువంటివారి పిల్లలను దత్తత తీసుకుని వారికి కూడా సహాయం చేద్దామని అనుకున్నారు.  ఎంతో కష్టపడి స్వయం కృషితో హీరోగా ఎదిగిన శ్రీహరి ఎంతోమందికి సహాయం చేసి మంచి మనిషిగా గుర్తింపుపొందారు. ఎంత ఎత్తుకు ఎదిగా ఒదిగి ఉండే మనస్తతత్వం శ్రీహరిది.  అక్షర ఫౌండేషన్ ద్వారా  ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించిన, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించిన, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న రియల్ హీరో శ్రీహరి.  

కానీ మీడియా చానల్స్ మాత్రం రియల్ హీరోలను మరిచి రీల్ హీరోలను ఎక్స్ పోజ్ చేస్తున్నాయి. మోదీ కన్నా ముందే శ్రీహరి లాంటి వ్యక్తి ఎంతో చేసినా గతం గతం అన్నట్లు కనీసం ఒక్కటంటే ఒక్క వార్త కూడా లేకపోవడం దారుణం. తెలుగు మీడియా చానల్స్ కు ఉన్న పైత్యం మరోసారి కనిపించింది. ఆలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. ఇంకా దత్తత కార్యక్రమాల్లోనే ఉన్న గ్రామాల మీద, ఆ గ్రామాలను దత్తత తీసుకున్న స్టార్ ల మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి మీడియా హౌజ్ లు. అయితే అన్ని అలాంటివే అన్నది కాదు ఉద్దేశం కానీ కొన్ని మీడియా ఛానల్స్ ఐనా మరిచిపోయిన హీరోలను.... శ్రీహరి లాంటి వారిని గుర్తిస్తే మంచిది అన్నది ఉద్దేశం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srihari  mahesh Babu  Srimathudu  Prakash Raj  Sachin  Modi  Mahesh babu News  

Other Articles