Forensic Science Laboratory Confirms That Skull And Bones Are Match Sheena Bora DNA | Indrani Mukherjea Samples

Forensic science laboratory confirms skull bones sheena bora indrani mukherjea samples

sheena bora murder case, sheena bora news, sheena bora updates, sheena bora skull, sheena bora bones, indrani mukherjea samples, indran mukherjea updates, indrani killed sheena bora, sheena bora latest updates, forensic science lab

Forensic Science Laboratory Confirms Skull Bones Sheena Bora Indrani Mukherjea Samples : Forensic Science Laboratory That The Skull And Bones Which Found In Raigarh Are Matched To Indrani Mukherjea DNA Samples Which Reveals That Body Related To Sheena.

షీనాబోరా కేసులో వీడిన అస్థికల మిస్టరీ

Posted: 09/07/2015 06:24 PM IST
Forensic science laboratory confirms skull bones sheena bora indrani mukherjea samples

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో మిస్టరీ వీడింది. ఈ కేసులో భాగంగా విచారణను వేగవంతం చేసిన పోలీసులకు రాయ్ గఢ్ జిల్లాలోని అడవి ప్రాంతంలో ఓ పుర్రెతోపాటు అస్థికలు లభ్యమైన విషయం తెలిసిందే!

షీనాని హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని ఆ ప్రదేశంలో పూడ్చినట్లుగా తెలిసిన నేపథ్యంలో పోలీసులు అక్కడ దర్యాప్తు చేయగా.. వారికి ఆ ఎముకలు లభ్యమయ్యాయి. అవి షీనాబోరా అస్థికలేనా? కాదా? అనే విషయమై ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా.. అవి ఆమెకు సంబంధించినవేనని పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని ఫోరెన్సిక నిపుణులు వెల్లడించారు. రాయ్ గఢ్ జిల్లాలో వెలికితీసిన పుర్రె, ఇతర ఎముకలతోపాటు ఇంద్రాణి ముఖర్జియా శాంపిల్స్ ను కలినాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ విశ్లేషణ చేసింది. అందులో భాగంగా ఇద్దరి డీఎన్ఏలు ఒక్కటేనని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో.. ఆ అస్థికలు ఎవరివన్న మిస్టరీ వీడింది.

ఇదిలావుండగా.. ఈ హత్యకేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్ రాయ్ ల జ్యుడీషియల్ కస్టడీని ముంబై కోర్టు మరో 14 రోజుల విధించింది. అయితే.. ఇంద్రాణి మాజీ భర్త సంజీవర్ ఖన్నాకు మాత్రం పోలీస్ కస్టడీ పొడిగించింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ నిమిత్తం కోల్ కతాకు తీసుకు వెళుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheena bora murder case  indrani mukherjea custody  

Other Articles