harley davidson bike thief arrested in mumbai

Harley thief kiran arrested police narreted details

harley davidson bike thief arrested , thorlapati kiran arrested in mumbai 6Lakh Harley davidson bike stolen, 6 lakh bike stolen in hyderabad, Jubilee Hills, Harley Davidson, Banjara Hills, nagarjuna circle, 6Lakh Harley taken for a test drive stolen, Banjara Hills police

harley davidson bike thief thorlapati kiran arrested in mumbai and remanded to court today in hyderabad

డబ్బు లేదు.. కానీ బైక్ నడపాలని ఆశ.. అందుకే అలా చేశా

Posted: 09/05/2015 09:15 PM IST
Harley thief kiran arrested police narreted details

హార్లీ డేవిడ్‌సన్ బైక్ నడపాలన్న ఆశ తనకు ఎప్పటినుంచో ఉందని.. బైక్ కోనేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగితే తల్లిదండ్రులు కాదనడంతో కసి పెంచుకున్నానని.. ఎలాగైనా ఈ బైక్ నడిపి తీరాలన్న ఉద్దేశంతోనే దొంగతనం చేశా'నని హార్లీ డేవిడ్‌సన్ బైక్ చోరీ నిందితుడు తొర్లపాటి కిరణ్ తెలిపాడు. సైనిక్‌పురికి చెందిన తొర్లపాటి కిరణ్ ట్రయల్ రన్ వేస్తానంటూ ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని హార్లీడేవిడ్‌సన్ షోరూం నుంచి రూ.6 లక్షల ఖరీదు చేసే బైక్‌తో పరారైన విషయం తెలిసిందే. అతని కోసం ముంబై వెళ్లిన పోలీసు బృందం కిరణ్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఈ ఘటన సంబంధిచిన వివరాలు వెల్లడించారు.

బైక్ దోంగతనానికి పాల్పడిన నిందితుడు తొర్లపాటి కిరణ్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విచారణలో.. గత కొంతకాలం నుంచి తన మానసికస్థితి సరిగా లేదని కిరణ్ వెల్లడించాడు. 'ఓఎన్‌జీసీ ఉద్యోగినైన నేను ముంబై సముద్ర జలాల్లో 15 రోజులు విధులు నిర్వహిస్తాను. మిగతా 15 రోజులు సెలవులో ఉంటా. రేయింబవళ్లు పని చేయడం వల్ల నిద్రాహారాలు లేక మానసికంగా అనారోగ్యం పాలవుతున్నా' అని అతను చెప్పినట్లు డీసీపీ తెలిపారు. ముంబైలో బైక్‌ను విక్రయిస్తున్న సమయంలోనే బంజారాహిల్స్ క్రైం పోలీసులు వలపన్ని కిరణ్‌ను పట్టుకున్నారని డీసీపీ చెప్పారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jubilee Hills  Harley Davidson  Banjara Hills  thorlapati kiran  

Other Articles