One Rupee for Kg Onion | Online

Online grocers to sell onions at re 1 per kg

Onion, Online, Ninjacart, SRS Grocery, Bangaluru, Delhi, One rupee for one kg onion

Online grocers to sell onions at Re 1 per kg Hyperlocal delivery services have got on to a price war on onions. Bengaluru based hyperlocal startup Ninjacart and Delhi based SRS Grocery on Thursday declared that they will sell onions at R1 a kg for a 3-day period between September 4 and 6.

ఒక్క రూపాయికే కిలో ఉల్లిపాయలు

Posted: 09/04/2015 09:33 AM IST
Online grocers to sell onions at re 1 per kg

అవును.. మీరు చదివింది నిజమే.. ఒక్క రూపాయికే కిలో ఉల్లిపాయలు వస్తున్నాయి. ఈ వార్త చదవగానే ఎక్కడ ఎక్కడ..? అనే ప్రశ్న. అయితే ఆ ప్రశ్న కంటే ముందు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. బిజినెస్ ను డెవలప్ చెయ్యాలంటే రకరకాల మార్గాలున్నాయి. ఏ సీజన్ లో పండ్లు ఆ సీజన్ లోనే అమ్మాలి. ఏ ఎండకాగొడుగు అన్నట్లు దేశం మొత్తం ఉల్లితల్లి కంట తడి పెట్టిస్తుంటే ఇదే అంశాన్ని తన వ్యాపార అస్త్రంతగా మార్చుకుంది ఓ కంపెనీ. ఒక్క రూపాయికే కిలో ఉల్లిపాయలు అన్నడంలో ఆ కంపెనీ పాపులర్ అయిపోయింది.  బెంగళూరుకు చెందిన హైపర్ లోకల్ స్టార్టప్ నింజా కార్ట్, ఢిల్లీకి చెందిన  ఎస్ఆర్ఎస్ గ్రోసరీ మూడు రోజుల పాటు ఒక్క రూపాయికే కిలో ఉల్లిపాయలను అందించనున్నట్లు ప్రకటించాయి. సెప్టెండర్ 4 నుండి 6 తేది వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే బయట ఉల్లి ధరలు ఎలా మండుతున్నాయో అందరికి తెలుసు. మామూలుగా ఉల్లి ధర 60 నుండి 80 ఉండగా కొన్ని చోట్ల ఏకంగా వంద వరకు ఉంది. అయితే రూపాయికి కిలో ఉల్లిపాయలను నింజాకార్ట్ వారు ఒక వ్యక్తికి ఒక కిలో మాత్రమే అందిస్తుండగా.. ఎప్ఆర్ఎస్ గ్రోసరీ వారు ఒక వ్యక్తి రెండు కిలోల ఉల్లిపాయలను ఒక్క రూపాయి ధరతో అమ్ముతున్నారు.

ఎస్ఆర్ఎస్ గతంలో కూడా ఉల్లిపాయలను 19 రూపాయలకు కిలో అమ్మింది. అప్పుడు కూడా విపరీతమైన స్పందన వచ్చింది. దాంతో ఎస్ఆర్ఎస్ గ్రోసరీస్ సిఈఓ ప్రాతిక్ జిందాల్ తాజాగా రూపాయికే కిలో ఉల్లిపాయలను అందించేందుకు సిద్దమయ్యారు. గతంలో తాను ఇలాంటి ఆపర్ పెట్టినప్పుడు దాదాపు 3500వేల ఆర్డర్లు వచ్చాయని తాజాగా కూడా అలాంటి వెల్లువవస్తోందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మంచి ధరలకు సరుకులను అందించడమే తమ లక్ష్యమని ప్రాతిక్ వెల్లడించారు. ఏది ఏమైనా కానీ ఎస్ఆర్ఎస్ గ్రోసరీస్, నింజా కార్ట్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని రూపాయికే కిలో ఉల్లిపాయలను పొంది సంతోషపడుతున్నారు వినియోగదారులు. అసలే మండుతున్న ఉల్లిధరలకు ఈ కంపెనీలు బంగారం లాంటి ఆపర్ ఇస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onion  Online  Ninjacart  SRS Grocery  Bangaluru  Delhi  One rupee for one kg onion  

Other Articles