YSRCP, Roja | Assembly | Gollapudi Surya Rao

Ysrcp mla roja overaction in ap assembly

YSRCP, Roja, Assembly, Gollapudi Surya Rao, Jagan, Chandrababu Naidu

YSRCP MLA Roja overaction in ap assembly. She immitates TDP MLA Gollapudi Surya Rao at the Media point.

ITEMVIDEOS: రోజా ఓవర్ యాక్షన్.. అసెంబ్లీలో చెక్క భజన

Posted: 09/01/2015 11:38 AM IST
Ysrcp mla roja overaction in ap assembly

నగరి ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో వేషాలకు తక్కువేం లేదు. ఆలూ లేదు సూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఏం ఉన్నా లేకున్నా రోజా అతికి మాత్రం అడ్డు ఉండదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల కండువాలను మార్చి మార్చి ప్రజలను ఏమారుస్తున్న  రోజా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద పీకలదాకా కోపం ఉన్నట్లు మైక్ పట్టుకొని పూనకం వచ్చినట్లు తెగ మాట్లాడేస్తుంటారు రోజా మేడమ్. మాట మాటకు జగన్ ను మోసేస్తూ.. చంద్రబాబును బలి చేస్తూ మాటల తూటాలు పేల్చే రోజా తాజాగా యాక్షన్ లో దిగారు. యాక్షన్ లోకి దిగారు అంటే ఏదో సినిమా షూటింగ్ లాంటిది అనుకోకండి.. అమ్మగారికి ఈ మధ్య వెటకారం ఎక్కువైంది. అందుకే మాట మాటకు పంచ్ లేస్తోంది. పంచ్ లు రాయలేక పాపం మీడియా మిత్రులు కూడా అలసిపోతున్నారు. అందుకే తాజాగా యాక్షన్ లో దిగింది.

రోజా ఏపి అసెంబ్లీ సమావేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలోకి వెళ్లడానికి ముందే మాటల తూటాలు పేల్చిన రోజా.. చంద్రబాబు నాయుడు మీద, అతని ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించింది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటకు రోజా కౌంటర్ వేశారు. పనిలో పనిగా టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు మీద కూడా రోజా పంచ్ లు వేశారు. టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ సభలో వైసీపీ అధ్యక్షుడి హావభావాలు, మాటలు చూస్తుంటే ఆయనలో అపరిచితుడు అప్పుడప్పుడు బయటకు వస్తాడని వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకొని జగన్‌లాంటి మూర్ఖుడు రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉండటం బాధాకరమన్నారు. అయినా వెటకారం ఎక్కువ చేస్తే ముందుకే మోసమొస్తుందని రోజా అమ్మగారికి ఎన్నటికి తెలిసేనో.. పాపం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Roja  Assembly  Gollapudi Surya Rao  Jagan  Chandrababu Naidu  

Other Articles