After nellore man, now kurnool youth got heart attack for AndhraPradesh special status

Man heart broke for special status to ap

Kurnool, Lokesh, Ramisetti Lakshmiah, hanged himself to death, Keshavulu Nagar, Vedayapalem, Nellore, special status to Andhra Pradesh, Tirupathi, kama munikoti, set ablaze, Andhra Pradesh, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news

A young youth man, identified as lokesh, is reported to have cardiac arrest after having a day long protest demanding special status to Andhra Pradesh.

ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ.. ఆగిన మరో గుండె..!

Posted: 08/28/2015 08:15 PM IST
Man heart broke for special status to ap

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. మరోకరు అసువులు బాసారు. తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో అందరి సమక్షంలో కామమునికోటి అనే వ్యక్తి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తరువాత క్రమంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ మరణాలు సంభవిస్తున్నాయి. ఏలూరులో దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం మరువక ముందే నెల్లూరు జిల్లాలో రామిశెట్టి లక్ష్మయ్య(55) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. మరో గుండె కూడా ప్రత్యేకహోదా కోసం నినదిస్తూ.. నిలిచిపోయింది.

ఏపీకి ప్రత్యేక హోదా రావట్లేదన్న మనస్తాపంతో కర్నూలుకు చెందిన లోకేష్ అనే వ్యక్తి, హోదా సాధన కోసం నిన్న జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. ప్రత్యేక హోదా సాధన సమాఖ్య కార్యకర్తలతో కలసి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాడు. హోదాపై మిత్రులతో చర్చించాడు. ప్రత్యేక హోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడే నష్టాలపై మాట్లాడాడు. హోదా రాదేమోనన్న మనస్తాపంతో, ఆందోళనకు గురైన లోకేష్ కు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే, మార్గమధ్యంలో ప్రాణాలు వదిలాడు. లోకేష్ మృతితోనైనా రాజకీయ పక్షాలు కన్ను తెరచి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని ప్రత్యక హోదా సాధన సమాఖ్య విజ్ఞప్తి చేసింది. లోకేష్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kurnool  Lokesh  Ramisetti Lakshmiah  AP special status  kama munikoti  

Other Articles