No body care jagan | YS jagan | statements

Jagan looking like a joker in telugu states

jagan, YS jagan, statements, Pawan Kalyan, Dharna, Special status, AP, Chandrababu naidu, Congress

Jagan looking like a joker in Telugu states. jagan also following Pawan Kalyan and trying to earn name. no body care about Jagan statements

కూరలో కరివేపాకులా మారిన జగన్

Posted: 08/26/2015 11:26 AM IST
Jagan looking like a joker in telugu states

అవును.. మీకు చదివింది అక్షరాల నిజం. జగన్ చేస్తున్న హడావిడి చూసిన వాళ్లంతా ఏదో జరగబోతోంది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల మీద ఎప్పుడూ నోరు చించుకునే జగన్ ను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అటు అధికార పక్ష పార్టీ నేతలు, ప్రతిపక్షంలో ఉంటున్న మిగిలిన  పార్టీల నాయకులు కూడా జగన్ ను పెద్దగా పట్టించకుకోవడం లేదు. ఇక ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు వైఖరిని పదేపదే ప్రశ్నించే జగన్ మీద మంత్రులు అంతే స్థాయిలో మండిపడుతున్నారు. జగన్ కు కనీసం పరిపాలన విషయాలు కూడా తెలియవని.. మైక్ పట్టుకొని ఊకదంపుడు ఉపాన్యాసాలివ్వడంతో కాలం వెల్లదీస్తున్నారని మండిపడుతున్నారు.

గతంలో అధికార పక్షం మీద మాటల తూటాలను పేల్చిన కాంగ్రెస్ నాయకులు తమ టార్గెట్ ను మార్చాయి. వైసీపీ నేత జగన్ ను తమ టార్గెట్ గా చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. జగన్ కు, జగన్ పార్టీకి ఓట్లు రాకుండా, తమ ఓటు బ్యాంక్ ను భద్రంగా కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ జగన్ ను లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతోంది. అయితే జగన్ మాట్లాడుతున్న మాటలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా.. అసలుకే కొట్టివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా వైసీపీకి పడ్డాయని అందుకే జగన్ పార్టీని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే గ‌తంలో ఎన్నడూ లేని విధంగా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు పీసీసీ చీఫ్ ర‌ఘువీరా.జ‌గ‌న్‌కు పెరిగే ప్రతి ఓటూ కాంగ్రెస్‌దే అవుతుందని... అలాగే ఆయ‌నకు దూర‌మ‌య్యే ప్రతి ఓటూ కాంగ్రెస్ ద‌గ్గర అవుతుంద‌ని విశ్లేషిస్తున్న నేత‌లు... ఇక‌పై జ‌గ‌న్‌ను టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని, మోడీని నిందించాల్సిన జ‌గ‌న్... రాహుల్‌పై విమ‌ర్శలు చేయ‌డాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ జ‌నంలోకి వెళ్లబోతోంది.

పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటన చేసి అక్కడి వారి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు కదా అని జగన్ కూడా అలానే చేద్దామని ఫిక్సయ్యారు. అందుకే ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 29 నాడు బంద్ కు పిలుపునిచ్చారు. పైగా చంద్రబాబు నాయుడు తమ బంద్ ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు అంటూ భారీ భారీ డైలాగ్ లు వేస్తున్నారు. అయినా కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పవన్ కు వచ్చినట్లు నాక్కూడా మంచి పేరు వస్తుందనుకుంటే అత్యాశే. ఎందుకంటే పవన్, జగన్ ఇద్దరికి మూడక్షరాల పేర్లు ఉన్నంత మాత్రం ఒక్కటే కారు. అలాగే ఎవరి మీద నమ్మకం వాళ్ల మీదే ఉంటుంది.అటు అధికార పార్టీ వాళ్లు పట్టించుకోక.. ప్రతిపక్షపార్టీల నేతలు కనీస విలువ ఇవ్వక.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కరివేపాకులా మారిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jagan  YS jagan  statements  Pawan Kalyan  Dharna  Special status  AP  Chandrababu naidu  Congress  

Other Articles