AP | Chandrababu Naidu | Special status | Delhi

Chandrababu naidu didnt sucess in the delhi tour

AP, Chandrababu Naidu, Special status, Delhi, Modi, Arun Jaitley, Rajnath Singh

Chandrababu Naidu didnt sucess in the Delhi tour. He didnt get any assurance on special status for the state of ap.

దిల్లీలో చంద్రబాబు చక్రం తిరగలేదు

Posted: 08/26/2015 07:46 AM IST
Chandrababu naidu didnt sucess in the delhi tour

ఏపీ ఆశల చిట్టాతో హస్తినలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబునాయుడు.. ప్రధాని సహా ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం అందించాలని మంత్రులందర్నీ కోరారు సీఎం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రులతో వరుసగా మీట్ అయ్యారు. మొదట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా అక్కడికే రావడంతో ఆయనతో కూడా భేటీ అయ్యారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని రాజ్ నాథ్ ను కోరారు బాబు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు రాజ్ నాథ్.వెంకయ్య, రాజ్ నాథ్ తో భేటీ తర్వాత ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, కేంద్రం సాయం, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదతర అంశాలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం చేయాలని మోడీని కోరారు సీఎం. విభజన చట్టం అమలు, రాష్ట్ర పరిస్థితులు, పెండింగ్ సమస్యలపై చర్చించారు. ప్రధానితో భేటీలో అరుణ్ జైట్లీ, నీతి అయోగ్ సీఈవో కూడా పాల్గొన్నారు. వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు కూడా వివిధ అంశాలపై చర్చించారు. ఫైనల్ గా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు అరుణ్ జైట్లీ. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ లాగా.. హస్తినలో భేటీలు బాగానే జరిగినా.. కేంద్రం నుంచి వచ్చే సాయంపై క్లారిటీ లేదు. ఆర్థికసాయం ఏ విధంగా ఉంటుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే.. బీహార్ ఎన్నికల తర్వాత మోడీ ప్రకటన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కాగా ఈ రోజు కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. నేటి సాయంత్రం జరిగే కేంద్ర మంత్రి వర్గ భేటీలో కూడా ఏపి అంశాలను చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. మరి హస్తిన నుండి తీపి కబురుతో చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారా..? అన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Special status  Delhi  Modi  Arun Jaitley  Rajnath Singh  

Other Articles