chandrababu slams UPA government in bifurcating state

Venkaiah is abhimanyudu of indian parliament babu

Chandrababu Naidu, Venkaiah Naidu, TDP, BJP, AP Special Status, Andhra Pradesh Special Status, bihar special packages, chandra babu praises venkaiah, Venkaiah is Abhimanyudu of Indian Parliament

Andhra pradesh chief minister chandrababu will never question the Centre and in turn he starts boasting them and praising them

ఆయన సామాన్యుడు కాదు.. రాజ్యసభ అభిమన్యుడు..

Posted: 08/20/2015 08:52 PM IST
Venkaiah is abhimanyudu of indian parliament babu

నిత్యం కాంగ్రెసుపై రుసరుసలాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గడిచిన తప్పిదాలను వల్లేవేస్తు పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మిత్రపక్ష బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను తుంగలో తోక్కుతున్నా.. ఏపీని పక్కనబెట్టి.. బీహార్ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో తాయిలాలను ప్రకటిస్తున్నా.. వారిని పన్నెత్తి మాట అనని చంద్రబాబు.. పైపెచ్చు వారిని పోగత్తలతో ముంచెత్తుతున్నాడు. రాష్ట్ర విభజన జరిగిన తీరు తలుచుకుంటే తనకు ఇప్పటికీ బాధ కలుగుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభ తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు కట్ చేసి ఏపీని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించిందని మండిపడ్డారు.

రాజ్యసభలో వెంకయ్యనాయుడు అభిమన్యుడిలా పోరాడారని కితాబిచ్చారు. కేవలం ఆయన వల్లే ప్రత్యేక హోదా తదితర హామీలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు చేసిందంతా చేసి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు. హైదరాబాదులాగే ఏపీని కూడా నెంబర్ వన్ చేసేంత వరకు నిద్రపోకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులు బాగా సహకరిస్తున్నారని చెప్పారు. కేంద్ర సహకారంతో అభివృద్ధి దిశగా దూసుకుపోదామని అన్నారు. పట్టిసీమపై వైకాపా, కాంగ్రెస్ పార్టీలు రాద్ధాంతం చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Venkaiah Naidu  TDP  BJP  AP Special Status  

Other Articles