A Mumbai Girl Story Got Huge Responce On Facebook | Facebook Controversy | Child Marriages

Mumbai girl facebook marriage story huge response netizens

mumbai girl fb story, mumbai girl marriage story on facebook, mumbai woman marriage story, mumbai girl marriage fb story, child marriages, mumbai young woman marriage story, facebook controversies, facebook new stories

Mumbai Girl Facebook Marriage Story Huge Response Netizens : A Mumbai Girl Story Who Refused to Marry at 15 Got Huge Responce On Facebook Which Got More Likes And Shares.

‘ఫేస్ బుక్’లో సంచలనం సృష్టిస్తున్న ఓ అమ్మాయి కథ

Posted: 08/14/2015 10:17 AM IST
Mumbai girl facebook marriage story huge response netizens

సామాజిక మాధ్యమమైన ‘ఫేస్ బుక్’లో ఓ టీనేజ్ అమ్మాయి కథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ కథకు 49 వేలకంటే ఎక్కువ లైక్లు, 3200 షేర్లు వచ్చాయంటే అది ఎంత అద్భుతమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతలా ప్రతిఒక్కరిని ఆకర్షించిన ఆ కథ ఏమిటంటే.. ముంబైకి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి వయస్సు 15 ఏళ్లు. ఇంకా మైనరే అయిన ఆ అమ్మాయికి ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. ఆ తర్వాత పెళ్లి చూపులు, కట్నకానుకల విషయాలు, ఇతర తతంగాలు మొత్తం నడిచాయి. పెద్దలంతా పెళ్ళి నిశ్చయానికి వచ్చేశారు కూడా. అయితే.. ఇంత చిన్న వయసులో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ అమ్మాయి సంబంధం నిరాకరించింది. కానీ.. ఇంట్లోవాళ్లు అందుకు ఒప్పుకోకపోగా.. పెళ్లి చేసుకోవాల్సిందేనని బలవంతం చేయసాగారు. ఇక ఆ తర్వాత ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఏం చేసింది..? ఇంకా తదితర విషయాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.

‘నాకు మా ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం చూశారు. నేనూ ఆ అబ్బాయిని చూశా. కానీ.. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇంట్లోకివాళ్లకు స్పష్టంగా చెప్పాను. వారు అందుకు అంగీకరించకపోవడంతో నన్ను నేను రక్షించుకోవడం కోసం.. ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు ఈ విషయం చెబుతానని బెదిరించాను. ఇదివరకే ఇద్దరు పిల్లలు వుండి, విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు చెప్పారు. 15 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు నేనెలా తల్లిని కాగలను. నా గురించి ఇంట్లో వాళ్లు ఎందుకు ఆలోచించడం లేదు. నేనింకా చదువుకోవాలి. స్వతహాగా సంపాదించాలి. ఇతరులపై ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నది నా ఆశయం. నా కల సాకారమయ్యేంత వరకు ఆగను. ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ఆశయ సాధన కోసం పోరాడుతాను’ అని ఆ అమ్మాయి పేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ కథ చదివి చలించిపోయిన చాలామంది నెటిజన్లు.. ఈ టీనేజ్ ఈ అమ్మాయిని అభినందిస్తూ.. ఆశయ సాధనకు అండగా ఉంటామంటూ కామెంట్లు పోస్ట్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai girl marriage story on fb  Child Marriages  

Other Articles