megastar chiranjeevi has given latest photo shoot for his new movie

Chiranjeevi getting ready for his 150th film

Chiranjeevi Latest Photoshoot, 150th movie, auto johny, puri jaganath, ram charan, chiranjeevi news, chiranjeevi photo shoot, chiranjeevi 150 film, chiru 150 film news, chiru 150 film photos, chiranjeevi with ram charan, puri jagannath with chiranjeevi, chiranjeevi photo gallery, chiranjeevi updates, chiranjeevi movie updates

megastar chiranjeevi has given latest photo shoot for his new movie which goes viral on internet

అభిమానుల్లో ఉత్కంఠరేపుతున్న ‘చిరు’ లేటెస్ట్ ఫోటో స్టిల్స్..!

Posted: 08/06/2015 09:22 PM IST
Chiranjeevi getting ready for his 150th film

వరుసపెట్టి తెలుగు సినిమాలు భారీ హిట్లు కొడుతుండటం, వందలకోట్ల వసూళ్లు చేస్తుండటంతో.. అన్నీ మంచి శకునములే అని భావించిన చిరంజీవి.. తన 150వ సినిమా కోసం రెడీ అయిపోతున్నారా..? అంటే అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. ఇందుకు చిరంజీవి కొత్త లుక్తో కూడిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్లూ కలర్ ఫేడెడ్ జీన్స్, దానిమీద రౌండ్ నెక్ టీషర్టు ధరించిన చిరంజీవి, గాగుల్స్ పెట్టుకుని డార్క్ బ్లూ కలర్ గోల్ఫ్ కార్టును ఆనుకుని ఫొటోకు పోజిచ్చారు.

ఈ ఫోటోలు నెట్ లో సందడి చేస్తుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఎప్పడెప్పుడా అంటూ ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు..  ఇటీవల ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ట్విట్ తో ఇప్పుడు, అప్పుడు అంటూ ఎదురుచూస్తున్న తరుణలో మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ తో ఈ ఫోటోలు తన 150 చిత్రానికి సంబంధించినవా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. లేక రాంచరణ్ తేజ్ తాజా చిత్రంలో ఆయన నటిస్తున్నారన్న వార్తులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫోటోలు ఆ చిత్రానికి సంబంధించినవా..? అంటూ అభిమానులు గెస్ చేసుకుంటున్నారు.

ఇక మరికోందరు అభిమానులైతే.. ఇన్నాళ్లు జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలకు ఈ సారి జరగనున్న వేడుకలకు భిన్నంగా ఒక్క రోజు బదులు వారోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో తన జన్మదిన వారోత్సవాలకు సంబంధించి మెగాస్టార్ దిగిన ఫోటోలని ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఫోటోలు అటోజానీ చిత్రానివా..? లేక ఏ సందర్భంలో దిగనవంటూ బెట్టింగ్ లకు కూడా పాల్పడతున్నారు అభిమానులు. ఇక మరికోందరైతే.. తమ హీరో లేటెస్టు ఫోటోలను చూసి.. హాయ్ మెగాస్టార్ అంటూ గుండెలకు హత్తుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi Latest Photoshoot  150th movie  auto johny  puri jaganath  ram charan  

Other Articles