After Ajmal Kasab, another terrorist captured alive in J&K's Udhampur; 3 hostages rescued

Udhampur attack after kasab let terrorist qasim khan captured alive

Border Security Force (BSF), India-Pakistan, Jammu and Kashmir, Kasim Khan, LeT terrorist Qasim Khan, LeT terrorist Kasim Khan, 3 locals into hostage, J&K terror attack, BSF convoy attacked, Border Security Force Convoy attacked, Jammu and Srinagar Highway, Udhampur, JandK police, JK police, Home Ministry, Rajnath Singh

In a major success for the Indian Armed forces, one of the two terrorists who attacked the Border Security Forces (BSF) in Udhampur, was captured alive. The detained terrorist has been identified as Qasim Khan alias Usman.

కసబ్ తరువాత సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది ఖాసింఖాన్

Posted: 08/05/2015 02:14 PM IST
Udhampur attack after kasab let terrorist qasim khan captured alive

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో మారణహోమం సృష్టించిన  పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్లో సజీవంగా దొరికిన అబ్దుల్ కసబ్ తరువాత మరో ఉగ్రవాదిని భారతీయ ఆర్మీ దళాలు సజీవంగా పట్టుకున్నాయి. సదరు ఉగ్రవాది పాకిస్థాన్ కు చెందిన ఖాసింఖాన్ గా అర్మీ అధికారులు గుర్తించారు. ఈ ఉదయం ఉదంపూర్ సమీపంలో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒక ఉగ్రవాదిని బిఎస్ఎప్ జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిపిన ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే ప్రతిదాడికి దిగారు.

ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతం కాగా, మరో ఉగ్రవాది ముగ్గురు స్థానిక పౌరులను తన ఆథీనంలోకి తీసుకుని బిఎస్ఎఫ్ జవాన్ల దాడికి చెక్ పెట్టాడు. బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులను నిలిపివేతను అదునుగా చేసుకున్న ఉగ్రవాది ఖాసింఖాన్.. సమీపంలోని అటవీ ప్రాంతాలోకి పరుగులు తీశాడు. నాలుగు గంటల పాటు సదరు ఉద్రవాదికి, బీఎస్ ఎప్ జవాన్లకి మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ తరువాత ఉగ్రవాది చెరలో వున్న ముగ్గరు స్థానికుల సహాకారంతో ఉగ్రవాదిని తుదముట్టించేందుకు యత్నించిన బీఎస్ఎష్ జవాన్లు ఆ ముష్కరుడిని ఏకంగా ప్రాణాలతోనే పట్టుకున్నారు.

కసబ్ తరువాత మరో ఉగ్రవాది ప్రాణాలతో సజీవంగా పట్టుబటడం ఇదే ప్రథమం. కాగా సదరు ఉగ్రవాది పేరు ఖాసిం ఖాన్ అని, అతని 20 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సులో వున్నాడని అంచనా వేస్తున్నారు. అతను పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ కు చెందినవాడుగా అనుమానిస్తున్నారు. పంజాబ్ లోని దీన్ దార్ లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ముష్కరిడైనా సజీవంగా పట్టుకోవాలన్ని భారత్ ఆర్మీ ప్రయత్నాలు ప్రతిఫలించలేదు. కాగా, ఇవాళ మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుని భారత్ ఆర్మీ దళాలు విజయాన్ని సాదించాయి. దీంతో దాయధి దేశం పాకిస్థాన్ అసులు రంగును, స్వరూపాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం భారత్ కు మరోమారు దక్కింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Border Security Force (BSF)  India-Pakistan  Jammu and Kashmir  Kasim Khan  

Other Articles