RBI keeps repo rate unchanged at 7.25%; CRR unchanged

Rbi ignores govt pressure keeps key rates unchanged

RBI ignores govt pressure, RBI, Interest Rates on Hold, RBI Monetary Policy, money, rbi, monetary policy, Reserve Bank of India (RBI), repo rate, reverse repo rate, interest rate, CRR, slr, RBI policy meet, RBI governer, raghuram rajan

Rebuffing pressure from the government to reduce cost of borrowing, Reserve Bank of India governor Raghuram Rajan on Tuesday kept key policy rates unchanged.

ప్రభుత్వ ఒత్తిడికి తలోగ్గని రాజన్.. కీలక వడ్డీ రేట్లు యథాతథం

Posted: 08/04/2015 08:37 PM IST
Rbi ignores govt pressure keeps key rates unchanged

వడ్డీ రేట్లు తగ్గించి ఆదుకోండి. లేకపోతే నెట్టుకు రావడం కష్టం. వర్ధమాన దేశాల పోటీని తట్టుకోలేమని గత కొంత కాలంగా భారత కార్పొరేట్‌ రంగం చేస్తున్న వేడుకోలును రిజర్వు బ్యాంక్‌ పక్కన బెట్టింది. దీనికి తోడు ప్రభుత్వం సైతం వడ్డీ రేట్లు తగ్గించాలని పరోక్షంగా ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌పై ఒత్తిడి పెంచినా.. మంగళవారం నాటి సమీక్షలో ఆర్‌బిఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణం పేరు చెప్పి ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గించక పోవడం మంచిది కాదని.. ప్రభుత్వం నుంచి వచ్చిన విమర్శలకు కూడా ఆయన అదేస్థాయిలో బదులుచెప్పారు.

ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ నేతృత్వంలో ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో భారతీయ రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రేపో రేటు 7.25 శాతం, రివర్స్ రేపోరేటు 6.25 శాతం, నగదు నిలువ 4.5 శాతం ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగించింది. ఈ రోజు జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం దిగొచ్చినా జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరడంతో ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో ఆర్‌బిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Raghuram Rajan  emis  money  monetary policy  

Other Articles