The world's oldest man dies in Japan, aged 112 | Sakari Momoi | Yasutaro Koide | Susannah Mushatt Jones

World s oldest man dies in japan aged 112

World's oldest man dies in Japan aged 112, Sakari Momoi, Yasutaro Koide, Susannah Mushatt Jones, Japanese media, tokyo, guinness world records, Dies oldest man, Japan, Guinness World Records, Gerontology Research Group

Sakari Momoi, who was recognized as the world's oldest man and credited healthy eating and getting plenty of sleep for his longevity, has died at the age of 112, Japanese media said.

ప్రపంచ అత్యధిక వయస్సు గల కురువృద్దుడు కన్నుమూత

Posted: 07/07/2015 09:39 PM IST
World s oldest man dies in japan aged 112

ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలవానిగా గుర్తింపు పొందిన సకారీ మోమోయ్(112) అనే జపాన్ కురువృద్దుడు ఇవాళ తనువు చాలించాడు. ఈ మేరకు మంగళవారం జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. 1903లో ఫుకుషిమాలో జన్మించిన సకారీ పేరు 2014 ఆగస్టులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది. సకారీ గతంలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తన చివరి రోజుల్లో ఒక దస్తూరిగా పనిచేశాడు. అంతేకాకుండా ఆస్పత్రిలో నిర్వహించే వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.

సకారీ తన చివరి గడియల్లో మరో రెండు సంవత్సరాలు బ్రతకాలని ఆశగా ఉందన్నాడు. అయితే తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచిందన్నట్లు.. అతని ఆశ నెరవేకుండానే కన్నుమూశారు.  సకారీ మృతిచెందడంతో అతని స్థానంలో 1903 మార్చిలో జన్మించిన జపాన్‌కు చెందిన యసుతారో కొయిదే(112) ప్రపంచ అథ్యధిక వయస్సు కలవారిగా రికార్డులకెక్కాడు. కాగా, ఇప్పటి వరకూ అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా యూఎస్‌కు చెందిన సుసన్న ముషత్ జాన్స్(116) పేరు రికార్డల్లోనమోదైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tokyo guinness world records Dies oldest man Japan  

Other Articles