SC cancels petition against Revanth Reddy’s bail

Cash for vote sc cancels acb petitions on revanth reddy bail

Revanth reddy, bail petition, supreme court, Telangana ACB, ACB, petition, supreme court, Revanth Reddy’s bail

The Supreme Court has cancelled the ACB officials petition, which was filed against the Revanth Reddy’s bail.

రేవంత్ బెయిల్ రద్దు పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Posted: 07/03/2015 02:30 PM IST
Cash for vote sc cancels acb petitions on revanth reddy bail

తెలంగాణ ఏసీబీ అధికారులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. శుక్రవారం మధ్యాహ్నం సీజే జస్టిస్‌ హెచ్‌.ఎల్‌. దత్తు, న్యాయమూర్తులు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమిత్ రాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. రేవంత్ రెడ్డి మళ్లీ కస్టడీలోకి తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నించింది. ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని టీ ఏసీబీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

ఈమేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, సుప్రీంలో టీ ప్రభుత్వ న్యాయవాది ఉదయ్‌కుమార్‌ సాగర్‌, ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సాక్షుల్ని రేవంత్‌ ప్రభావితంచేసే ప్రమాదమున్నందున ఆయనకు, ఇతర నిందితులైన సెబాస్టియన్‌, ఉదయసింహకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు.  ఆ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఏసీబీ పిటీషన్‌ను కొట్టేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  bail petition  supreme court  Telangana ACB  

Other Articles