RSS | Rashtriya Swayamsevak Sangha | Dr. Keshav Baliram Hedgewar

Unknown facts about rashtriya swayamsevak sangha

RSS, Rashtriya Swayamsevak Sangha, Dr. Keshav Baliram Hedgewar, The Bhagwa Dhwaj , Indo-China war, Sardar Patel, Jawaharlal Nehru

Unknown facts about Rashtriya Swayamsevak Sangha The patriotic organization, Rashtriya Swayasevak Sangha was founded by Dr. Keshav Baliram Hedgewar in the year 1925, 25th September in an auspicious occasion of VijayaDashami. The belief of the Sangha was to encourage more and more people to join the RSS for the betterment of the country. It’s believed that unless the men of the country are working whole heartedly for Bharatmata,

ఆర్ఎస్ఎస్ గురించి తెలియని తొమ్మిది నిజాలు

Posted: 06/24/2015 01:47 PM IST
Unknown facts about rashtriya swayamsevak sangha

ఆర్ఎస్ఎస్ అంటే చాలు బారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్దమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ గా పేరుపొందింది. భారతమాత కోసం పని చెయ్యాలనుకొనే, దేశం అంటే అభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే ఆర్ఎస్ఎస్. దేశాభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు కానీ ప్రపంచానికి ఎంతో పరిచయమున్న ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలియని తొమ్మిది నిజాలు మీ కోసం..

1. ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి శాఖలు లేవు. ఈ సంస్థను నడుపుతున్న కూడా అందులోని సభ్యులే. భాగ్వ ధ్వజ(కాషాయం జెండా) ఆర్ఎస్ఎస్ లో అధినాయకత్వం. ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్లు కూడా ఈ జెండానే గౌరవిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో సేవకులు(వాలంటీర్లు) ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. దాదాపు 60లక్షల మంది వాలంటీర్లతో ఎంతో మంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ ఘననీయమైన సేవలను అందిస్తోంది.

rss01

2.ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికీ గుర్తింపు కార్డు(ఐడెంటిటి కార్డ్) కానీ బిజినెస్ కార్డ్ కానీ ఇవ్వరు. కేవలం భారతమాతకు సేవ చెయ్యాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు.ఆర్ఎస్ఎస్ లో ఎవరైనా చేరవచ్చు ఎవరు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు. ఖచ్చితమైన నిబంధనలేవీ ఉండవు.

rss02

3. ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ. కానీ మోదీ, వాజ్ పేయి, అడ్వానీ లాంటి బిజెపి నాయకులు మాత్రం ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్లు. అయితే చాలా మంది బిజెపి పార్టీలో ఆర్ఎస్ఎస్ భాగం అని అనుకుంటారు. ఒక్క బిజెపి పార్టీలోనే కాదు కాంగ్రెస్, ఆప్ పార్టీలలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒక్కటే యువత వ్యక్తిత్వాన్ని మలిచడం ద్వారా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడం.

rss03

4.ఇండో చైనా యుద్దం జరిగే సమయంలో దేశ భ్రదతకు అందరు సరిహద్దుల వద్ద యుద్దంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్దంలో పాల్గొన్నారు. ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు.

rss04

5. ఆర్ఎస్ఎస్ అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్ లకో వ్యతిరేకం కాదు. దేశమంటే గౌరవం అభిమానం ఉండి సేవ చెయ్యడానికి సిద్దంగా ఉన్న వాళ్లు ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో చేరవచ్చు. మన సంస్రృతి సంప్రదాయాలను కాపాడేందుకు, దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుంది.

rss05

6. ఆర్ఎస్ఎస్ లో కేవలం మగ వారికే కాదు మహిళలకు కూడా స్థానం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని పురుషుల కోసం విబాగం ఉంటే, మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సంఘ్ అని ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే.

rss06

7.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ ను విభేదించలేదు. కానీ 1948లో మాత్రం రాజకీయ వత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్ పై నిషేదం విధించారు. కానీ తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేశారు. అయితే నిషేదం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి లేఖ రాశారు.

rss07

8. చాలా మంది మహాత్మా గాంధీని చంపించింది ఆర్ఎస్ఎస్ అని నమ్ముతారు. కానీ నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా కొనసాగి, 1930లోనే ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వెళ్లిపోయారు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో లేరు.

rss08

9.జాతీయ ఉదార భావాలున్న ఆర్ఎస్ఎస్ ను జవహర్ లాల్ నెహ్రూ ఎంతో అభిమానించే వారు. 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పరేడ్(కవాతు) నిర్వహించారు.దాదాపు 3500 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు.

rss09

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles