Lady doctor | caught | drunken drive | Drunken drive women

Ladies also competeting in the drunk and drive cases

Lady doctor caught in drunken drive, Drunken drive women

ladies also competeting in the drunk and drive cases. Recently police caught ladies on drunk and drive. IN hyderabad, Banglore, Mumbai ladeies were caught in the drunk and drive case.

ITEMVIDEOS: డ్రంకన్ డ్రైవ్ లోనూ లేడీస్ ఫస్ట్

Posted: 06/20/2015 11:32 AM IST
Ladies also competeting in the drunk and drive cases

తాగిన మైకంలో కారు డ్రైవింగ్‌ చేస్తూ ఓ లేడీ డాక్టర్‌ హల్ చల్‌ చేసింది. హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండడాన్ని గమనించిన విజయ్‌ నగర్‌కు చెందిన డాక్టర్‌ అఖిల కారు ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. అతి కష్టం మీద ఆమెను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు . కవరేజ్ చేస్తున్న మీడియాపై చిందులేసింది ఆ డాక్టర్‌. డ్రంకన్ డ్రైవ్‌లో పలువురు మద్యం తాగనట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. గత నెలలోనూ మరో లేడీ డాక్టర్ ఇదే తరహాలో హల్ చేసింది. జూబ్లిహిల్స్ పోలీసులకు చుక్కలు చూపించింది. గతంలోనూ ఓ లేడీ డాక్టర్ మందు తాగి డ్రైవ్ చేస్తూ కనిపించింది. దాంతో ఆమెకు డ్రంకెన్ డ్రైవ్ కింద బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేద్దామనుకున్న పోలీసులకు చుక్కలు చూపించింది. రెండు గంటపాటు పోలీసులను తన వెంటతిప్పించుకొని చివరకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించుకుంది. అయితే ఆ కేసులో ఆ డాక్టర్ మోతాదుకు మించి తాగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఘటనే ముందైలోనూ .జరిగింది. అయితే అక్కడ లేడీ ఏకంగా పోలీసుల టెస్ట్ కు భయపడి కారులోనే డోర్స్ లాక్ చేసుకొని కూర్చుంది. ఏం చెయ్యాలో అర్థం కాని పోలీసులు నానాయాతన పడ్డారు. మొత్తానికి ఎలాగోలా ఆమెను కారు దింపి టెస్ట్ చేశారు. ఇలా ఈ మధ్య న డ్రంకన్ డ్రైవ్ లో మగవాళ్లకు మేమేం తక్కువా అన్నట్లు ఆడవాళ్లు పట్టుబడుతున్నారు. నిద్ర లేచింది మహిళా లోకం అనే మాటకు వంద శాతం వక్రభాష్యం చెబుతున్నారు ఈ లేడీస్.


 
*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lady doctor caught in drunken drive  Drunken drive women  

Other Articles