tollywood producer bandla ganesh into another controversary

Tollywood hero files case against producer bandla ganesh

tollywood producer bandla ganesh into another controversary, tollywood producer, tollywood news, Bandla ganesh, Legal notice, Ne Jatha ga nenundali, Sachin joshi, cheating case, Aashiqui-2 remake, parameshwara arts production, director jaya ravindra

tollywood hero Sachin joshi files cheating case against producer bandla ganesh, and sends him legal notices

మరో వివాదంలో చిక్కకున్న నిర్మాత బండ్ల గణేష్.. కేసు పెట్టిన హీరో..

Posted: 06/18/2015 12:57 PM IST
Tollywood hero files case against producer bandla ganesh

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించి.. నిర్మాత ఎదిగి.. టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో చిక్కుక్కున్నారు. ఆయనపై టలీవుడ్ హీరో చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు చేశారు. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ కోట్టిన అషికీ 2 చిత్రాన్ని రీమేక్ చేసి తెలుగులో తీసిన 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న హీరో సచిన్ జోషి.. బండ్ల గణేష్ కు నోటీసులు పంపించారు.

సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే  నీ జ‌త‌గా నేనుండాలి సినిమాకీ గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. అయితే ఆ సినిమా విషయంలో గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని  వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తాన‌ని చెప్పి... చివ‌రికి న‌ష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ త‌ప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandla ganesh  Legal notice  Ne Jatha ga nenundali  Sachin joshi  cheating case  

Other Articles