Chandrababu | Safe | noteforvote

Nara chandrababu naidu is safe at this time in note for vote scandal

CBN, chandrababu naidu, Cash for vote Case, scam, revanth reddy, Telangana AntiCorruption-Bureau, AP Forensic Science Laboratory, confessions, arrested accused, voice recording, Stephenson mobile, ap police

Nara chandrababu naidu is safe at this time in note for vote scandal. Ap police saying that revanth Reddy didnt express chandrababu name

ప్రస్తుతానికి బాబు సేఫ్ ఎందుకంటే..

Posted: 06/11/2015 03:36 PM IST
Nara chandrababu naidu is safe at this time in note for vote scandal

ఓటుకు నోటుకు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సేఫా? ప్రస్తుతానికైతే అవుననే చెప్పాలి. తెలంగాణ ఏసీబీ ఉన్నతాధికారులు ఇప్పుటికిప్పుడు చంద్రబాబును టచ్‌ చేయకపోవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఒకవేళ అరెస్ట్‌ చేసినా.. ఆడియో టేపుల్లో గొంతు బాబుదే అని నిరూపించాల్సి ఉంది. అదీగాక, స్టీఫెన్‌సన్స్‌తో బాబు మాట్లాడిన మాటల్లో ఎక్కడా డబ్బు ఇస్తున్నట్లు కానీ, ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి ప్రత్యక్షంగా ఇలా చేయండి అని చెప్పిన దాఖలాలేవీ లేవు. దీంతో, ఈ ఇష్యూలో ఇప్పటివరకు బయటపడిన సాక్ష్యాలతో బాబును అరెస్ట్‌ చేయటం, నోటీసులు జారీచేయటం సులభం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఇంకోవైపు.. రేవంత్‌రెడ్డి కూడా ఎక్కడా బాబు పేరు చెప్పకపోవటం పెద్ద రిలీఫ్‌ అని ఏపీ పోలీసులు వర్గాలంటున్నాయి. ఈ విషయంపై ఏపీ పోలీసు బాస్‌లు అంతర్గత చర్చల్లోనూ వచ్చిందని.. అయితే, చంద్రబాబు నాయుడును ఈ సాక్ష్యాలతో అరెస్ట్‌ చేయటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు కూడా.. ఆ గొంతు తనది కాదని చెబుతూ వస్తున్నారు. అయితే, బాబు గొంతును స్టీఫెన్‌సన్‌ తన మొబైల్‌లో రికార్డ్ చేయటం జరిగిందని తెలంగాణ ఏసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ ఆడియో టేపులను ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరెటరికి పంపి.. చంద్రబాబు వాయిస్‌ను పరిశీలించనున్నారు. బాస్‌ ఎవరో తేలితే.. ఆ తర్వాత.. ఏం చేయాలో ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవటమే మిగులుతుందని చెబుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles