Lawcet, Icet, Telangana

Telangana state lawcet and icet results will release today

Lawcet, Icet, Telangana

Telangana state Lawcet and Icet results will release today. The kakatiya University campus the Vice Chancellor will release the results.

తెలంగాణ ఐసెట్, లాసెట్ ఫలితాలు నేడు

Posted: 06/05/2015 07:51 AM IST
Telangana state lawcet and icet results will release today

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ , ఐదేళ్ల లా, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో గతనెల 19వ తేదీన నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్‌ పీజీ సెట్ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో  ఈ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విడుదల చేయనున్నారని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా లాసెట్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం  టీఎస్‌ఐసెట్-2015 నిర్వహించారు. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాశారు.  ఐసెట్‌కు సంబంధించి  మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఐసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కేయూ సెనెట్‌హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు.


ఫలితాలకు.. www.manabadi.co.in www.school9.com www.results.bharatstudent.com www.goresluts.net www.freshers9.com లలో చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lawcet  Icet  Telangana  

Other Articles