manohar parikar | Goa | Defence minister | media

Manohar parrikar stands in queue at wedding wins praise on social media

manohar parikar, Goa, Defence minister, media

Even before he took over as the country’s Defence Minister, Manohar Parrikar, who has served as the chief minister of Goa, is quite well-known for his humility and simple lifestyle. In a country where VIP culture remains deep-rooted along with abuse of power, Parrikar, an IIT graduate, often travelled economy class and moved around without extensive police escort when he was the CM.

పెళ్లిలో కేంద్ర మంత్రి క్యులో వచ్చారు.. భోజనం కూడా చేశారు మరి.!

Posted: 05/30/2015 04:41 PM IST
Manohar parrikar stands in queue at wedding wins praise on social media

ఎమ్మెల్యే అయితేనే ఎగిసి పడే నాయకులను చాలా మందిని చూసే ఉంటారు. కానీ ఎలాంటి స్థాయిలో ఉన్నా ఏమాత్రం గర్వం, పొగరు, దర్పం లేకుండా ఉండేవాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్లలో కేంద్కర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఖచ్చితంగా ముందుంటారు. చాలా తక్కవ మందిలో మాత్రమే ఉండే సింప్లిసిటి ఆయన సొంతం. మామూలు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రిగా ఎదిగారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కనీసం ఒక్క అవినీతి మరక కూడా లేని మనోహర్ పారికర్ గురించి గోవాలోనే కాదు చాలా చోట్ల చర్చ జరుగుతోంది. ఎందకంటారా..?

11329876 660690630728354 7806378584696253658 n

11163792 660690677395016 6159739258581858119 n

కేంద్ర రక్షణమంత్రి " మనోహర్‌ పారికర్ "  పూణె లొ ఒక మధ్య తరగతి వారి పెళ్ళికి వెళ్ళాడు .... తన భద్రత సిబ్బందిని బయటె వదిలి వెళ్లి అందరి లాగే వరుసలో నిలబడి వధూవరులను ఆశీర్వదించి వరుసలో నిలబడి భోజనం తీసుకొని భోంచేసి అక్కడకి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచెసారు ... మనోహర్ పారికర్ గారు గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూటర్ పై తిరిగె వారు .. సామాన్యుడిలాగె విమాన ప్రయాణం చేసేవారు. కాసింత స్థాయి పెరిగితే చాలు దర్పాన్ని ప్రదర్శించే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ మనోహర్ పారికర్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువ. తాజాగా మీడియాలో వచ్చని పారికర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : manohar parikar  Goa  Defence minister  media  

Other Articles