AP CM Chandrababu Naidu Warns TRS Govt In Issue Of Osmania University Lands | TDP Mahanadu

Chandrababu naidu warns trs govt osmania university land controversies

chandrababu naidu, osmania university lands, trs govt, chandrababu updates, tdp mahanadu, trs controversies, cm kcr, osmania lands issues, ou students controversies

chandrababu naidu warns trs govt osmania university land controversies : AP CM Chandrababu Naidu Warns TRS Govt In Issue Of Osmania University In Mahanadu Ceremony.

‘ఓయూ భూముల’పై టీఆర్ఎస్ కి వార్నింగిచ్చిన బాబు

Posted: 05/29/2015 11:39 AM IST
Chandrababu naidu warns trs govt osmania university land controversies

టీఆర్ఎస్ పార్టీ తమ ఇతరత్రా అవసరాలకు ఓయూ భూములను వినియోగించుకుంటోదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములు విద్యార్థులకే చెందాలని, వాటిపై హక్కు వారిదేనని పేర్కొన్న బాబు.. ఆ భూములను పరాధీనం చేస్తే టీడీపీ ఊరుకోదని స్పష్టం చేశారు. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా బాబు టీఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు.

టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎర్రబెల్లి దయాకరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఓయూ భూములను పక్కా ఇళ్ల నిర్మాణ అవసరాలకు వినియోగించాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ యోచనను తప్పుబట్టారు. ఇక ఈ వ్యవహారంపైనే చంద్రబాబు స్పందిస్తూ.. ‘గతంలో ఉస్మానియా భూములను కబ్జా చేయాలని చూశారు. దాన్ని అడ్డుకున్నాం. అలాగే ఓ సీఎం వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఇవ్వాలని చూశారు. కానీ వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు. హైదరాబాద్‌లో భూములను రక్షించిన చరిత్ర మనదే. ఉస్మానియా విద్యార్థులు చాలా త్యాగాలు చేశారు. ఓయూ భూములు విద్యార్థులకే చెందాలి. ఇతరత్రా అవసరాలకు వినియోగించడం సరికాదు. దాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని ప్రకటించారు.

ఓయూ భూములు సహా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక అస్తవ్యస్థ ప్రభుత్వ పాలన’ పేరుతో తీర్మాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే మాట్లాడిన బాబు.. ‘తెలంగాణ వచ్చేసింది. తెలంగాణను పాలించమని ప్రజలు మీకు అధికారమిస్తే బంగారు తెలంగాణ పేరుతో సొంత కుటుంబాన్ని బంగారంగా మార్చుకుంటున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా యూనివర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని సరికొత్త సమస్యలను సృష్టిస్తూ విద్యార్థి లోకంలో అలజడి సృష్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. మరి.. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrabau naidu  trs controversies  osmania university land  

Other Articles