Telangana EAMCET results, hyderabad, deputy cm kadiyam srihari

Telangana eamcet results will be announce today

Telangana EAMCET results, hyderabad, deputy cm kadiyam srihari

Telangana EAMCET results will be announce today. The Deputy cm Kadiyam srihari will release the eamcet results.

ఈ ఉదయం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Posted: 05/28/2015 08:19 AM IST
Telangana eamcet results will be announce today

తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీలలో ప్రవేశాల కోసం ఈ నెల 14న నిర్వహించారు. ఎంసెట్ ఫలితాలను జేఎన్టీయూ హైదరాబాద్ ఆడిటోరియంలో నేటి ఉదయం 11.30 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలతోపాటు ఎంసెట్, మెడికల్ విభాగంలో ర్యాంకులు సాధించిన వారి వివరాలను కూడా విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ రమణరావు తెలిపారు. ఫలితాలను  https://www.tseamcet.in/results.cgg.gov.in http://www.vidyavision.com తోపాటు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కాగా ఏపి ఎంసెట్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి.


ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలో ప్రవేశాల కోసం జూన్ మూడోవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వచ్చేనెల మొదటి వారంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. జూలై 31 నాటికి మొత్తం అడ్మిషన్ల పక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టు 1 నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యేలోపే కాలేజీల గుర్తింపు లెక్క తేలుతుందని జేఎన్టీయూ-హైదరాబాద్ అధికారులు స్పష్టం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana EAMCET results  hyderabad  deputy cm kadiyam srihari  

Other Articles