Jayalalitha | Rajinikanth | Sharathkumar | Illayaraja | Shashikala

Rajinikanth and sharath kumar came to jayalalitha pledge function in madras

Jayalalitha, Rajinikanth, Sharathkumar, Illayaraja, Shashikala

Rajinikanth and sharath kumar came to jayalalitha pledge function in madras. Rajinikanth and Jayalalitha had some differences but after long time Rajini appeared in Jayalalith function.

అమ్మ ప్రమాణ స్వీకారంలో మెరిసిన రజినీ, శరత్ కుమార్

Posted: 05/23/2015 11:44 AM IST
Rajinikanth and sharath kumar came to jayalalitha pledge function in madras

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, జయలలిత బెస్ట్ ఫ్రెండ్ శశికళ, ఆమె కుమారుడు సుధాకర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.  రజనీకాంత్, శరత్ కుమార్ పక్కపక్కనే ఆశీనులయ్యారు. అలాగే  అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అమ్మ పట్టాభిషేకానికి తరలి వచ్చారు. ఒకప్పుడు ఒకరంటే ఒకరికి పడని రజినీకాంత్.. జయలలిత ప్రమాణ స్వీకారానికి రావడం అందరిని ఆకర్షించింది.

ఇక జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి వెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు. జయలలిత తమిళంలో ప్రమాణ స్వీకారం చెయ్యగానే అబిమానులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమ్మ తిరిగి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అభిమానుల ఆనందం రెట్టింపైంది. భాజా భజానాలతో, తమిళ సంప్రదాయాలతో అమ్మ ఫోటోలను చేతి పట్టి ఊగిపోయారు కార్యకర్తలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jayalalitha  Rajinikanth  Sharathkumar  Illayaraja  Shashikala  

Other Articles