rahul gandhi | venkiah naidu | nda | modi | marks

Venkiah naidu about rahul on nda govt marks

rahul gandhi, venkiah naidu, nda, modi,, marks

Union Minister M Venkaiah Naidu on Tuesday hit back at Congress Vice President Rahul Gandhi for his remarks criticising the Modi government. Naidu tweeted, "Rahul gives Zero to NDA government. Zeros can't recognise Heroes. Zeros find Zeros only."

ఓహో విన్నారా.. జీరోలు హీరోను గుర్తించలేరంట..!

Posted: 05/19/2015 04:59 PM IST
Venkiah naidu about rahul on nda govt marks

రైమింగు, టైమింగు అదిరిపోయే పంచులు వెయ్యడంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుకు మించినవారు లేరు ఆయన నోరు తెరిస్తే చాలు.. ఎదుటి వ్యక్తులకు చెమటు పట్టాల్సిందే. అయితే గత కొంత కాలంగా మాంచి హుషారు మీదున్న రాహుల్ గాంధీ ప్రదాని మోదీని, బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసి మాటల తూటాలు పేలుస్తున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తైన సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ నరేంద్రమోదీ ప్రభుత్వానికి సున్నా మార్కులు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా మోదీ ప్రభుత్వానికి వేసిన మార్కులపై వెంకయ్యనాయుడు స్పందించారు.

అసలు జీరోలు, హీరోలు అంటూ మాంచి ప్రాసలో డైలాగ్ కొట్టారు. రాహుల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వానికి జీరో ఇచ్చారు.. కానీ జీరోలు హీరోలను గుర్తంచలేరు జీరోలు జీరోలను మాత్రమే గుర్తిస్తారు అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయినా ఇలా ప్రాసతో కూడిన ట్వీట్లు చేసి మరీ వార్తల్లోకెక్కారు వెంకయ్య నాయుడు. అయినా చాలా మందికి మోదీ హీరో కావచ్చు కానీ కాంగ్రెస్ దృష్టిలో మాత్రం జీరోనే అలాగే బిజెపి దృష్టిలో రాహుల్ జీరో కావచ్చు కానీ కాంగ్రెస్ దృష్టిలో మాత్రం హీరోనే. మరి అలాంటప్పుడు హీరోలు ఎవరు జీరోలు ఎవరు అని ఎవరు మాత్రం చెప్పగలరు.

venkiah-naidu-tweet-aboout-

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  venkiah naidu  nda  modi  marks  

Other Articles