Amethi food park: Rahul Gandhi attacks government

Farmers give zero marks to modi government says rahul gandi

farmers give zero marks to modi government says rahul gandi, rahul gandhi takes on centre on land bill, land bill, narendra modi, Prime minister, chief minister, kcr, farmers, padayatra, vadyal meeting, mini modi, kisan sandesh yatra, cintroversial comments, mahatma gandhi, father of the nation, power politics, zero marks, amethi, "politics of revenge".

Taking up the fight for mega food park in his Lok Sabha constituency Amethi, Rahul Gandhi marched through the dusty pathways to reach the site proposed for the unit and alleged that the project was cancelled by the Centre because of "politics of revenge".

మోడీ ఏడాది ప్రభుత్వ పాలనకు సున్నా మార్కులు..

Posted: 05/18/2015 08:48 PM IST
Farmers give zero marks to modi government says rahul gandi

భారత ప్రధానిగా మోదీ ఏడాది పాలనకి రైతులు సున్నా మార్కులు ఇస్తారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ అధికారంలో కొచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఓ జర్నలిస్ట్ మోదీ పాలనకి 1 నుంచి 10 మధ్యలో ఎన్ని మార్కులు ఇస్తారని అడగగా ఇలా సున్నా మార్కులు ఇస్తామని స్పందించారు. అంతేకాదు ప్రధాని సన్నిహితులైన ఇండస్ట్రియలిస్టులు మాత్రం పదికి పది మార్కులు ఇస్తారని వ్యంగ్యంగా బదులిచ్చారు. తన సొంత నియోజక వర్గంలో అమేథీలో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అమేధీ నియోజకవర్గంలో పర్యటించానున్నారు.

ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మోదీ పాలన పై విమర్శలు గుప్పించారు. రైతులు ఉత్పత్తులను విక్రయించేందుకు దోహదపడుతున్న ఫుడ్ పార్కును మోడీ ప్రభుత్వం తోలగించడంపై అయన నిప్పులు చెరిగారు. రైతులు, పేదలు, శ్రామికులు, నిరుద్యోగులు, దళితులు  మోదీ పాలనకు సున్నా మార్కులు ఇస్తారన్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చే రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, ఎంపీ నిధుల నుంచి నిర్మంచతలపెట్టిన పలు ప్రాజక్టులకు రాహుల్ శంకుస్థాపన చేయనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farmers  zero marks  Modi government  Rahul Gandhi  

Other Articles