Another Time Earthquake Hits North India in Bihar and Bengal | Nepal Earthquake

Earthquake in bihar bengal nepal north india

bihar earthquake, west bengal earthquake, nepal earthquake, earthquake incidents, north indian border, nepal news, bihar updates, west bengal updates

Earthquake In Bihar Bengal Nepal North India : Bihar earthquake on 16 May 2015 State hit by fresh 5.7 magnitude quake West Bengal shaken too.

బెంగాల్, బీహార్ లలో భూకంపం.. భయంతో జనాలు పరుగులు

Posted: 05/16/2015 06:27 PM IST
Earthquake in bihar bengal nepal north india

నేపాల్ ని అతలాకుతలం చేసిన భూకంపం ధాటికి అప్పట్లో ఉత్తర భారతం నుంచి ఇటు ఆంధ్రా బార్డర్ వరకు భూప్రకంపనలు సంభవించాయి. ఇప్పటికీ భూప్రకంపనలు భూతంలా ఉత్తర భారతాన్ని వెంటాడుతూనే వున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు చోటుచేసుకున్న భూకంపాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పగా.. భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది.

ఇప్పుడు తాజాగా మరోసారి శనివారం సాయంత్రం అటు నేపాల్ లోపాటు ఇటు భారత్ లోనూ బెంగాల్, బీహార్ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు.. తమ ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ఈ భూకంపం ధాటికి ఎంత నష్టం సంభవించిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

ప్రస్తుతం వచ్చిన భూకంపం చూస్తుంటే.. రానున్న రోజుల్లో మళ్లీ వచ్చే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వారు సూచిస్తున్నారు. ఈ భూకంపం ధాటికి ప్రజలను క్షేమంగా వుండే ప్రదేశానికి తరలించే ప్రయత్నాల్లో ప్రభుత్వాదికారులు మునిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : bihar earthquake  west bengal land news  nepal earthquake updates  

Other Articles