china | traffic | hammer | murder

Chinese traffic warden snaps and attacks pedestrian with a hammer

china, traffic, hammer, murder

A Chinese traffic warden violently attacked a pedestrian with a hammer because she crossed the road when the light was red. The patrol officer, who has not been named, hit the pedestrian repeatedly over the head with an iron hammer, after the woman ignored her command to not cross the road at 6pm on Tuesday in eastern Shandong province.

రెడ్ లైట్ పడ్డా ఆగలేదని సుత్తితో కొట్టి చంపింది.. బాబోయ్

Posted: 05/16/2015 04:33 PM IST
Chinese traffic warden snaps and attacks pedestrian with a hammer

అవును నిజం.. మీకు చదివింది అక్షరాల నిజం. ట్రాఫిక్ రూల్స్ పాటించండిరా.. బాబూ అంటే ఎవరూ పాటించడం లేదు. కానీ ఈ ఘటన గురించి విన్న తర్వాత మాత్రం వద్దన్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారేమో. చైనాలో ఓ సిగ్నల్ దగ్గర ఓ మహిళ నిల్చుంది. అయితే అదే టైంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ పడింది. దాంతో ఎక్కడి వెహికిల్స్ అక్కడే ఆగిపోయాయి. అయితే తొందరలో ఉందో ఏమో తెలియదు కానీ ఓ లేడీ మాత్రం కంగారు కంగారుగా రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. దాంతో అక్కడున్న ఆమె ఆగమని చెబుతున్నా.. పట్టించుకోకుండా సిగ్నల్ దాటి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అంతలోనే ఘోరం జరిగిపోయింది.

నేను చెబుతుంటే కూడా పట్టించుకోవా.. ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను సిగ్నల్ క్రాస్ చెయ్యనివ్వను అంటూ ఏకంగా సుత్తిలో తల మీద కొట్టింది. అంతే అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందో కూడా చాలా మందికి అర్థం కాలేదు. అయితే సుత్తితో గట్టిగా కొట్టేసరికి బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయింది. కాగా సుత్తితో ఓ మనిషి ప్రాణం తీసినా.. ఆమెలో ఎలాంటి కలవరం, ఆందోళన లేదు. పైగా సిగ్నల్ ను పాటించకపోతే ఇలానే ఉంటుంది అంటూ అందరికి హెచ్చరికలు కూడా జారీ చేసింది. తర్వాత పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేశారనుకోండి. మొత్తానికి రెడ్ సిగ్నల్ ఉన్నా రోడ్డు దాటడానికి ప్రయత్నించిందని ఏకంగా ప్రాణాలే తీసింది.. పాపిష్టిది.

*అబినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  traffic  hammer  murder  

Other Articles