Salman Khan files Rs.30,000 bail bond in Mumbai court.

Salman khan back home after getting fresh bail

hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news, chiranjeevi, mega star, tollywood mega star chiranjeevi,

In a relief to actor Salman Khan, the Bombay High Court on Wednesday granted bail to the actor and suspended his five-years sentence in 2002-hit-and-run case.

సెషన్స్ కోర్టుకు సల్మాన్ బెయిల్ బాండ్.. ఇంటికి తిరుగు పయనం..

Posted: 05/08/2015 07:16 PM IST
Salman khan back home after getting fresh bail

బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బోంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం ఆయన ముంబాయి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ బోంబే హైకోర్టు తీర్పును వెలువరించడంతో.. అయనకు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ కూడా రద్దు కావడంతో తాజా బెయిల్ కోసం ఆయనను ముంబై సెషన్స్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇందుకోసం ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లి తాజాగా ముఫై వేల రూపాయలతో తాజా బెయిల్ బాండ్ ను సమర్పించాలని అదేశించింది.

న్యాయస్థానం అదేశాల మేరకు సల్మాన్ ఖాన్ మధ్యాహ్నం 1.10 నిమిషాలకు బాంద్రాలోని తన నివాసం నుంచి ముంబై సెషన్స్ కోర్టుకు బయలుదేరగా, నాలుగు గంటల తరువాత అయన న్యాయస్థానానికి చేరుకున్నారు. ముంబాయ్ సెషన్స్ కోర్టు రూమ్ లో అప్పటికే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ బాండ్ పేపర్లను సిద్దం చేశారు. సల్మాన్ ఖాన్ కోర్టు రూమ్ లోకి వెళ్లి.. అక్కడ న్యాయమూర్తికి తన బెయిల్ బాండ్ అందజేశారు. దీంతో ఆయనకు బెయిల్ లభించింది.

సల్మాన్ న్యాయవాదుల అపీల్ మేరకు ఆయనకు పాస్ పోర్టును కూడా తిరిగి ఇచ్చేయాలని పోలీసులను అదేశించింది న్యాయస్థానం. కాగా ఆయన విదేశీ పర్యటనలను మాత్రం ప్రాథాన్యతా క్రమంలో అనుమతించాలని చెప్పింది. కాగా బెయిల్ బాండ్ పూర్తైన నేపథ్యంలో షూరిటీలను సమర్పించేందుకు రెండు వారాల గడుపునిచ్చింది. కాగా సల్మాన్ ఖాన్ కేసు తదుపరి విచారణను జులై, ఆగస్టు మాసంలో విచారించే అవకాశాలు వున్నట్లు న్యాయనిపుణలు అంటున్నారు. దీంతో అభిమానులు ఆయన నివాసం వద్ద స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. న్యాయం గెలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  chiranjeevi  Hit and run case  Mumbai  bail  

Other Articles