10tv | Kit | 3G | Livekit

Unknown persons theft 3g kit of a telugu news channnel in hyderabad

10tv, Kit, 3G, Livekit, MGBS, Hyderabad,

Unknown persons theft 3g kit of a telugu news channnel in hyderabad. telugu news channel, 10tv representatives went to coverage the news on rtc strike.

టివి ఛానల్ కిట్టు కొట్టేశారు.. అదీ హైదరాబాద్ లో

Posted: 05/07/2015 11:50 AM IST
Unknown persons theft 3g kit of a telugu news channnel in hyderabad

తెలుగులో చానళ్ల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ప్రాంతీయ భాషలో లేనన్ని ఛానళ్లు ఒక్క తెలుగులోనే ఉన్నాయంటే నమ్మాలి మరి. అయితే ఛానళ్లలో దొంగతనాలు ఎలా జరిగాయి.. ఎక్కడ.. ఎప్పుడు అంటూ ఏకంగా క్యారెక్టర్లతో సహా చూపించే టిడి చానళ్లకు ఓ ఝలక్ పడింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పాపం తెలుగు ప్రజలు ఆర్టీసీ సమ్మెతో అష్ట కష్టాలు పడుతున్నారని కవర్ చెయ్యడానికి వెళ్లిన టీవి బృందానికి సాలిడ్ గా షాక్ తగిలింది. లైవ్ కవరేజ్ కోసం వెళ్తే పాపం వాళ్లు వాడుతున్న లైవ్ కిట్ ను కొట్టేశారు. తెలుగు టివి ఛానళ్లలో ఓ ప్రముఖ ఛానల్ కు సంబందించిన త్రిజి కిట్ ను కొట్టేశారు దొంగలు. అసలు ఆ ఛానల్ ఏది.. ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు కింది స్టోరీలో మీకే సమాధానాలు దొరుకుతాయి.

రెండు రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ బంద్ పాటిస్తోంది. దాంతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న జనాన్ని తమ మీడియాలో కవర్ చెయ్యడానికి 10టివి వాళ్లు హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే అక్కడ వారు లైవ్ టెలికాస్ట్ కోసం 3జి కిట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అలా లైవ్ టెలికాస్ట్ చెయ్యడానికి అని తెచ్చిన కిట్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తు కొట్టేశారు. సరే కొట్టేసింది ఎవరో కనీసం సిసిటివిల ద్వారానైనా తెలుసుకోవచ్చు అనుకున్న మీడియా వారికి మరో షాక్ తగిలింది. తమ కిట్ కొట్టేసిన సీన్ ఏ కెమెరాలోనూ కవర్ కాలేదు. దాంతో పాపం కంగారు పడ్డ మీడియా వాళ్లు ఉసూరుమంటూ ఆఫీస్ కు వెళ్లిపోయారు. మరి అలా వెళ్లిన వారు తమ కిట్ పోయింది.. మా త్రిజి కిట్ కనిపించడం లేదు అంటూ తమ ఛానల్ లోనే యాడ్ ఇస్తారేమో అంటూ కొంత మంది కామెడీ చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10tv  Kit  3G  Livekit  MGBS  Hyderabad  

Other Articles