AP | Facsials | Powders

Ap govt decided to sell facial and cosmotic powders as kerala

AP, Facsials, Powders, cosmotics, Kerala, forest, sheshachalam,

AP govt decided to sell facial and cosmotic powders as kerala. AP officials trying to sell the sandalwood related fascials, powers.

పౌడర్.. పౌడరే.. ప్రభుత్వం వారి పౌడరే

Posted: 05/06/2015 04:27 PM IST
Ap govt decided to sell facial and cosmotic powders as kerala

ఏపి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇది అందరికి తెలిసిన నిజం. అయితే రాష్ట్రానికి అధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాటిపై అక్కడి అధికారులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా అక్కడ దొరికే చందనం మొక్కలపై వచ్చే ఆదాయంపై వారు ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఏపి ప్రభుత్వానికి అధికంగా ఆదాయాన్ని తీసుకురావాలని అక్కడి అధికారులు ఓ అదిరిపోయే ఐడియా గురించి ఆలోచించారు. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా.. పౌడర్ అమ్మి ఖజానా నింపాలని అధికారులు ఆలోచించారట. అదేంటి పౌడర్ లు అత్తర్లు అమ్ముకోవడం ఏంటా అని అనుకోకండి మామూలు పౌడర్ కాదు లెండి చందనంతో కూడిన పౌడర్, ఫేసియల్ లు అమ్మాలని ఏపి ప్రభుత్వం అనుకుంటోంది.


తాజాగా ఏపీ సర్కార్ ఎర్రచందన పౌడర్లను అమ్మే ప్రతిపాదనలకు మెరుగులు దిద్దుతోంది. ఫేసియల్ పౌడర్ తో పాటు, ఇతర ఫార్మా ఉత్పత్తులను తయారుచేసి అమ్మాలని భావిస్తోంది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వాని ఫాలో అవుతోంది ఏపీ. ఇప్పటికే కేరళ ఫారెస్టు అభవివృద్ధి కార్పొరేషన్ అధికారులు ఫేసియల్ ప్యాక్ తో పాటు, చర్మ వ్యాధులకు సంబంధించిన మందులను తయారు చేయించి అమ్ముతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎర్రచందనం ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఏపీ సర్కార్ కూడా దీనిపై ఫారెస్టు డిపార్ట్-మెంట్ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఫేసియల్ క్రీమ్స్ తో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి ప్రతిపాదనలను సమర్పించాలని ఫారెస్టు అధికారులను కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ఫారెస్టు అధికారులు కూడా దీన్ని నిర్ధారిస్తున్నారు. శాండల్ పౌడర్ తయారీపై ప్రభుత్వం కొన్ని సూచనలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే అందుకు ఏపీలో కొన్ని చట్టబద్ధమైన పరిమితులు ఉన్నాయని వారు అంటున్నారు. ఏపీ దగ్గర అనుమతులు తీసుకొని కేరళ ప్రభుత్వం చందనం ఉత్పత్తులను అమ్ముతోందని ఫారెస్టు అధికారులు అంటున్నారు.

 

దేశంలో ఇప్పటికే కొన్ని ప్రైవేటు కంపెనీలు లైంగిక సామర్థ్యాన్ని పెంచే చందనం మందులను అమ్ముతున్నారు. వీటికి తోడు రెడ్ శాండల్ తో తయారయ్యే ఫేసియల్ పౌడర్లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. మార్కెట్ లో ఈ వస్తువులు పరిమితంగా ఉండడంతో భారీ డిమాండ్ ఉంటోంది. కర్నాటక ఫారెస్టు డిపార్ట్ మెంట్ మున్నూరు పర్యాటక ప్రాంతంలో శాండల్ ప్రొడక్ట్స్ ను విక్రయిస్తోంది. ముఖంపై మొటిమలు తొలగించేందుకు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు శాండల్ ఉత్పత్తులు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం శాండల్ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టింది. మరోవైపు చైనాలో రెడ్ శాండల్-తో తయారైన మందులకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్న చైనా ప్రతినిధులు రెడ్ శాండల్ వస్తువులను ఉత్పత్తి చేయడంపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Facsials  Powders  cosmotics  Kerala  forest  sheshachalam  

Other Articles