fake bomb threat call to secunderabad railway station

Bomb threatening call to secunderabad railway station

bomb threatening call to secunderabad railway station, fake bomb threat call, secunderabad railway station, bomb in railway station, threat call, secunderabad railway station, balaiah, ranganreddy district, shankerpally, dog squad, bomb squad

fake bomb threat call to secunderabad railway station made police searchings on

అక్కడ బాంబులు పెట్టాం జాగ్రత్తా.. బాలయ్య ఫోన్ కాల్..!

Posted: 05/03/2015 04:52 PM IST
Bomb threatening call to secunderabad railway station

ఒక అకతాయి ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టిందింది. ముచ్చెమటు పట్టించింది. దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వాటర్ గా ప్రఖ్యాతి గాంచి..దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టామని పోలీసులకు సమాచారం అందడంతో తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. నిత్యం వచ్చిపోయే ప్రయాణికులతో రద్దీగా వున్న సికింద్రాబాద్ రైల్వే అధికారులకు ఇవాళ మధ్యాహ్నం మూడో నంబర్ ఫ్లాట్ ఫారం వద్ద బాంబులు అమర్చినట్లు ఓ అగంతకులు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షఃణం సమాచారాన్ని రైల్వే, సివిల్ పోలీసులు అందించారు.

దీంతో రంగంలోకి దిగిన బాంబ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ లోపలే కాకుండా వెలుపల అవరణ పరిసరాల్లో పోలీసులు తనీఖీలు చేసి.. ఇది ఎవరో అకతాయి ఫోన్ కాల్ అని తేల్చి ఊపిరి పీల్చుకున్నారు. అయితే అధికారులకు వచ్చిన నెంబరు ఆధారంగా.. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ముచ్చెమటలు పట్టించింది రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన బాలయ్య అనే వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. ప్రస్తుతం బాలయ్య కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bomb in railway station  threat call  secunderabad railway station  balaiah  

Other Articles