Are farmers not part of 'Make in India', asks Rahul Gandhi in Parliament

Rahul gandhi speaks in the lok sabha on farmers crisis

Rahul Gandhi, Congress, Parliament, Lok Sabha, Indian Farmers, Farmers suicides, unseasonal rains, Indian Parliament, Agrarian Crisis, Rajya Sabha, farmers, Suicides, Hailstorm, Farmers who commit suicide are cowards and criminals, Suicide is a crime as per Indian law, Haryana Agriculture Minister OP Dhankar, farmers suicide, 'Make in India', Prime Minister Narendra Modi.

Congress Vice President Rahul Gandhi on Wednesday once again raised the issue of farmers in the Lok Sabha targeting Prime Minister Narendra Modi. Speaking in the Lok Sabha, Rahul said, "Your government says "make in India"​, but this goverment is not of labourers and farmers."

రైతు సమస్యలపై నేరుగా ప్రధానిని టార్గెట్ చేసిన రాహుల్

Posted: 04/29/2015 12:51 PM IST
Rahul gandhi speaks in the lok sabha on farmers crisis

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగి వచ్చిన తరువాత.. కాంగ్రెస్ పగ్గాలను అనధికారికంగా చేతపుచ్చుకున్నాడు. వచ్చి రావడంతోనే రైతుల పక్షాన నిలిచిన రాహుల్.. భూ సంస్కరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గోన్నారు. కాంగ్రెస్ పక్షాన అన్ని తానై పోరాడేందుకు సంసిద్దుడైన రాహుల్.. తన ఇమేజ్ ను పెంచుకోవడం.. కన్నా దేశంలోని ప్రజల సమస్యలను ఎత్తిచూపి వారి పక్షాన నిలవడంపై దృష్టి సారించాడు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సరిగ్గా పదకోండు మాసాలు కావస్తున్న తరుణంలో రాహల్ తోలిసారి పార్లమెంటులో ప్రధానిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

బుధవారం పార్లమెంటులో రైతుల సమస్యలపై గళమెత్తిన రాహుల్ గాంధీ.. మీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రచారం చేస్తుందని, యావత్ దేశానికి అన్నం పెడుతున్న రైతన్న సకాలంలో పంటలు పండిస్తున్న రైతుల మేక్ ఇన్ ఇండియా చేయడంలేదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతలు పట్ల గుడ్డిగా వ్యవహరిస్తుందని, దేశంలో దృతరాష్ట్రుడి పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ప్రభుత్వం కనీసం రైతులను, రైతు కూలీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

పంటలు పండక రైతులు అకలికి అలమట్టిస్తూ.. తమ దీన పరిస్థితిని తలుచుకుని కుటుంబాన్ని పోషించే స్తోమత లేక మరణమే శరణ్యమని అత్మహత్యలకు పాల్పడుతుండగా, వాటిని కూడా బీజేపి నేతలు అపహాస్యం చేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఓం ప్రకాష్ దన్కర్ వ్యాఖ్యాలను రాహుల్ గాంధీ పార్లమెంటులో ఊటంకించారు. ఆత్యహత్యలు చేసుకునే రైతులు పిరికిపందలు, నేరగాళ్లు అని దన్కర్ వ్యాఖ్యాలను రాహుల్ తప్పబట్టారు.

దేశంలో రైతులను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని అయితే, కొన్నాళ్లుగా మోదీ దేశంలోనే ఉంటున్నారు... ఈ నేపథ్యంలో పంజాబ్ వెళ్లి రైతుల పరిస్థితిని ఓ సారి పరిశీలించాలని రాహుల్ గాంధీ... ఈ సందర్భంగా మోదీకి సూచించారు.  క్షేత్రస్థాయిలో వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యాలపై సభలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హర్సిమ్రత్ కౌర్ రాంవిలాస్ పాశ్వాన్ మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.... ఆ సమయంలో రాహుల్ గాంధీ ఏ ప్రాంతానికి వెళ్లి రైతులను పరిశీలించారని హర్సిమ్రత్ కౌర్ ప్రశ్నించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Congress  Parliament  Lok Sabha  Indian Farmers  Farmers suicides  unseasonal rains  

Other Articles