Venkiah naidu | central govt | uban ministry | modi | bjp

Parliament pac slams on central urban minister venkiah naidu venkiah naidu didnot focus on his own minisrty

Venkiah naidu, central govt, uban ministry, modi, bjp, rajiv awas, parliament sessions

Parliament PAC slams on central urban minister Venkiah Naidu.Venkiah Naidu didnot focus on his own minisrty. The central govt plans to provide houses for all by 2022.

మాటలు ఫుల్.. పనులు నిల్.. వెంకయ్యా.. యే క్యాహై..?

Posted: 04/29/2015 11:56 AM IST
Parliament pac slams on central urban minister venkiah naidu venkiah naidu didnot focus on his own minisrty

వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్ తల పెట్టోయ్ అని మహాకవి గురజాడ అన్నమాటలను తుంగలో తొక్కుతున్నారు ఓ కేంద్ర మంత్రి. చేతలు కాదు కానీ కేవలం మాటలు మాత్రమే అంటున్నారు సదరు మంత్రి వర్యులు. ఇంతకీ ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై మాటల తూటాలతో గుక్కతిప్పకోనివ్వని మన పార్లమెంటరీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గురించే ఇంత చెప్పింది. అసలు విషయం ఏమిటంటే వెంకయ్య నాయుడు కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారని.. తన స్వంత శాఖ పని తీరును కూడా బాగుచెయ్యడంలో వెనుకబడ్డారని పార్లమెంటరీ స్థాయి సంఘం మండిపడింది. స్వంత శాఖను ముందు బాగుచేసుకోవాలని.. పని తీరును మార్చుకోవాలని స్థాయి సంఘం హితవు పలికింది.

కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రెండింటిని బిజెపి ఎంపీ ఎం. వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్నారు. అయితే తన పట్టణాబివృద్ది శాఖ పని తీరుపై పార్లమెంటరీ స్థాయి సంఘం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెంకయ్య నాయుడు పని తీు ఎంత దారుణంగా ఉందో తేలింది. పట్టణాభివృద్ది శాఖలో ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ అని ఏకంగా పార్లమెంటరీ స్థాయి సంఘం మండిపడింది. 2022నాటికి అందరికి ఇళ్లు, జాతీయ జీవనోపాధి మిషన్, రాజీవ్ ఆవాస్ యోజన లాంటి పథకాలను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తోంది. కానీ 2022 నాటికి అందరికి ఇళ్లు పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినా ఇంత వరకు విధివిధానాలను పట్టణాభివృద్ది శాఖ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. రాజీవ్ ఆవాస్ యోజనకు నిధులు కేటాయించలేదని, దానికి బదులుగా అందరికి ఇళ్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా ఇంత వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. మొత్తానికి మాటలతో కాలం గడపకుండా చేతలు చేసి చూపిచాలని బిజెపి ఎంపీ పినాకి మిశ్రా నేతృత్వంలొని బృందం సలహా ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా మంత్రి గారు నోటికి పని తగ్గించి.. పని మీద దృష్టి పెడతారో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah naidu  central govt  uban ministry  modi  bjp  rajiv awas  parliament sessions  

Other Articles