Another young Cricketer Rahul Ghosh hospitalised head injury

Cricketer rahul ghosh hospitalised with head injury kolkata

Cricketer Rahul Ghosh, Rahul ghosh injured, cricketer injured Fielding, Cricketers Injured ground, Philip Houghes Death, ankit kesari death news

Cricketer Rahul Ghosh hospitalised with head injury Kolkata : another cricketer Rahul Ghosh was hospitalised on Tuesday after he sustained an injury while fielding during a local league game between Kolkata Police and Vijay Sports in Kolkata.

తలకు దెబ్బతగిలి మైదానంలోనే కుప్పకూలిన మరో క్రికెటర్

Posted: 04/21/2015 07:29 PM IST
Cricketer rahul ghosh hospitalised with head injury kolkata

ఇటీవలే కాలంలో ఏదైనా ఓ సంఘటన చోటుచేసుకుంటే దానికి అనుబంధంగా మరిన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఆమధ్య విమానాలు వరుసబెట్టి పేలిపోవడం ఒక సంచలనమైతే.. ఈమధ్య క్రికెటర్లు మైదానంలోనే కుప్పకూలిపోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

మొన్న ఆస్ట్రేలియా క్రికెట్ ఫిలిప్ హ్యూస్.. నిన్న పశ్చిమ బెంగాల్ ఆటగాడు అంకిత్ కేసరి.. వీరిద్దరూ మైదానంలో తీవ్రంగా గాయపడి అకాలమరణం చెందారు. ఎంతో ప్రతిభ, మంచి భవిష్యత్ ఉన్న ఈ యువ ఆటగాళ్ల మరణం క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో యువ ఆటగాడు మైదానంలో గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ కోల్కతా పోలీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం బిజోయ్ స్పోర్ట్స్ క్లబ్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ఈ 19 ఏళ్ల రాహుల్ ఒక్కసారిగా గాయపడ్డాడు. రాహుల్ తలకు ఎడమ వైపున గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతగాడు మైదానంలో కుప్పకూలిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన క్రికెట్ సిబ్బంది అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్ తీయించారు. చికిత్స చేసిన అనంతరం డాక్టర్లు అతడికి గాయమైన చోట రక్తం గడ్డకట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం రాహుల్ పరిస్థితి నిలకడగా ఉన్నా మరో వారంరోజులపాటు పరిశీలనలో ఉంచనున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇతను తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricketer Rahul Ghosh  cricket Horror Incidents  

Other Articles