Non Resident Indian becomes New York's first Indian-American judge

Raja rajeswari becomes new york s first indian american judge

Raja Rajeswari New York's first Indian-American judge, NRI Indian New York's first Indian-American judge, Chennai born Raja Rajeswari, first person of Indian descent, New York City criminal court judge, first Indian descent to be New York City criminal court judge, Richmond County District Attorney's office, Padmalaya Dance Academy, Padma Ramanathan, Bharat Natyam and Kucchipudi dance

Chennai born Raja Rajeswari, who came to America when she was 16, has become the first person of Indian descent to be named as a criminal court judge in New York City.

స్వప్నంలా వుంది.. అమెరికా తొలి భారత మహిళా న్యాయమూర్తి

Posted: 04/16/2015 04:36 PM IST
Raja rajeswari becomes new york s first indian american judge

అమెరికాలో  మొట్టమొదటి భారత జాతి అమెరికన్ మహిళా జడ్జిగా  తాను ఎంపిక కావడం స్వప్నంలా వుందని, తాను ఊహించిన విజయ బాట కన్నా ఎన్నో రెట్లు అధికంగా వుందని, చెన్నైకి చెందిన రాజరాజేశ్వరి అన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరం క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా అమె ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమె తన ఆనందాన్ని స్థానికి పిలివి డాట్ కామ్ తో పంచుకున్నారు. ఎక్కడ దూరం నుంచి వచ్చని తనలాంటి పరదేశీ (భారత మహిళ) వనితల చిరకాల స్వప్నం మాత్రమే కాదని, తన విజయం తనలాంటి ఎందరో భారతీయ వనితలకు కూడా స్వప్నంగా మరుతుందని అమె అన్నారు. దీనిని అందిపుచ్చుకునేందుక భారతీయ వనితలు పోటీ తత్వం పెరగాలని ఆకాంక్షించారు.

16 ఏళ్ల  వయసులో ఉండగా అమెరికాకు వెళ్లిన  రాజరాజేశ్వరి  గత పదహారేళ్లుగా రిచమండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అటార్నీగా పనిచేస్తున్నారు. మేయర్ బిల్ డే  బ్లాసియో  న్యూయార్క్లోని  క్రిమినల్ కోర్టు జడ్జిగా రాజేశ్వరిని నామినేట్ చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ కౌంటీ హౌసింగ్ కోర్టులో జయ మాధవన్, న్యూయార్క్ కౌంటీ సుప్రీంకోర్టులోని ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో అనీల్ సి సింగ్ అనే ఇద్దరు భారతీయులు న్యాయమూర్తులు అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్నారు.  రాజ రాజేశ్వరి ఒక్క న్యాయశాస్త్రంలోనే కాదు భరతనాట్యం, కూచిపూడి నృత్యంలో కూడా  ప్రవీణురాలే. తన తల్లి  పద్మారామనాథన్ పేరిట నెలకొల్పిన పద్మాలయా డాన్స్ అకాడమీ తరపున తన బృందంతో పలు ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raja Rajeswari  New York  first Indian-American judge  

Other Articles